పవన్ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నా ‘తొలిప్రేమ’ మూవీ పవన్ ను అప్పటి యూత్ కు బాగా కనెక్ట్ చేసింది. పవన్ నటించిన సినిమాలలో ఆల్ టైమ్ బెస్ట్ క్లాసిక్ గా ఈసినిమాను ఇప్పటికీ పరిగణిస్తూ ఉంటారు. అందువల్ల ఈసినిమాను ఇన్ని సంవత్సరాల తరువాత బుల్లితెర పై ఎప్పుడు టెలికాస్ట్ చేసినా ఇప్పటికీ రేటింగ్స్ బాగానే వస్తూ ఉంటాయి.

 VARUN TEJ LATEST PHOTOS IN TOLI PREMA MOVIE కోసం చిత్ర ఫలితం

మళ్ళీ ఇన్నాళ్ళకు అదే టైటిల్ తో వరుణ్ తేజ్ సాహసం చేస్తున్నాడు. దీనితో ఈ మెగా యంగ్ హీరో నటిస్తున్న ఈ ‘తొలిప్రేమ’ పై కూడ మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈరోజు సాయంత్రం ‘తొలిప్రేమ’ ఆడియో వేడుక హైదరాబాద్ లో జరగబోతోంది.

 PAVAN KALYAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

అతిధిగా ఎవరు వస్తారో బయటికి చెప్పకుండా సస్పెన్స్ మైంటైన్ చేస్తున్నారు. హల్ చల్ చేస్తున్న వార్తల ప్రకారం ఈ వేడుకకు అతిధిగా రమ్మని పవన్ కళ్యాణ్ కు నాగబాబు వరుణ్ తేజ్ స్వయంగా ఆహ్వానించినట్లు టాక్. పవన్ ఈ ఆహ్వానానికి తిరస్కరణ చెప్పక పోవడంతో ఈ ఈవెంట్ కు పవన్ రాబోతున్నాడు అంటూ వార్తల హడావిడి మొదలైంది.

 సంబంధిత చిత్రం

‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ తరువాత పవన్ తిరిగి జనంలోకి ముఖ్యంగా తన అభిమానుల మధ్యకు వచ్చే సరైన అవకాశం కోసం వేచి చూస్తున్నాడు అన్న వార్తలు ఇప్పటికే ఉన్నాయి. దీనికితోడు పవన్ కళ్యాణ్ కు సంబంధించిన సమస్యలు అన్నీ సద్దుబాటు అయిపోయిన నేపధ్యంలో పవన్ జనం మధ్యకు వచ్చి తన అభిమానులను కలుసుకునే మంచి అవకాశం ఇదే అని కొందరి వాదన. అయితే పవన్ ఆలోచనలు ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాయి కాబట్టి ఈవిషయంలో పవన్ ను అంచనా వేయడం ఎవరికీ అంత సులువైన విషయం కాదు.. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: