2002 లో తెలుగులో వచ్చిన సొంతం అనే సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమయింది ఈ బొద్దుగుమ్మ. సొంతం తరువాత విక్టరీ వెంకటేష్ సరసన   హీరోయిన్ గా జెమిని అనే సినిమాలో నటించింది. వెంకటేష్ లాంటి స్టార్ హీరో పక్కన నటించినప్పటికీ ఈ అమ్మడుకి పెద్దగా అవకాశాలు రాలేదు. ఇంక ఇక్కడ ఛాన్సులు లేకపోవటంతో పొరుగు సినీ ఇండస్ట్రీల మీద దృష్టిసారించి తమిళ ప్రజలకు అభిమాన నటిగా ఎదిగింది.


ప్రస్తుతం నమిత తన బాయ్ ఫ్రెండ్ ,తమిళ నటుడు మరియు నిర్మాత అయిన వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లికి ముందు ఒక సీనియర్ నటుడితో ప్రేమలో పడినట్లు,వారిరువురూ వివాహం చేసుకొనబోతున్నట్లు పుకార్లు కూడా పుట్టాయి. అయితే ఆ సీనియర్ నటుడు అసలు నమిత ఎవరో తెలియదని అనడం, ఆయన వయసేంటి నా వయసేంటి అని నమిత అనడంతో అది వట్టి పుకారే అని తేలిపోయింది. తిరుపతిలో వివాహమాడిన కొత్తజంట మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ నమిత  ప్రభాస్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలిపారు.


కెరీర్ ఆరంభంలో చాలా నాజూకుగా ఉన్న ఈ అమ్మడు ఉన్నట్లుండి లావెక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పటికే తెలుగు ఇండస్ట్రీలో అస్సలు అవకాశాలు రావడంలేదు ఇంక మరీ ఇంత లావు అయితే ఎవరు అవకాశం ఇస్తారు అనుకున్న టైములో మెహెర్ రమేష్ తను తీసిన బిల్లా సినిమాలో నమితకు సెకండ్ హీరొయిన్ గా అవకాశమిచ్చారు. మలేషియాలో బిల్లా షూటింగ్ జరగుతున్న సమయంలో ప్రభాస్ ను చూసి ఆశ్చర్యపోయింది. షూటింగ్ స్పాట్ లో  కెమెరా, లైటింగ్ సామాన్లు మోసేవాడు,ఒక స్టార్ హీరో  అలా చేయడం ఎంతైనా అతని మంచితనం, అతను చాలా మంచోడు అంటూ కితాబిచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: