టాలీవుడ్ హీరోల మార్కెట్ గత కొంత కాలంగా చాలా వరకు పెరుగుతూ వస్తోంది. జయపజయలతో అసలు సంబంధమే లేకుండా ప్రతి సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా రికార్డ్ స్థాయిలో వసూళ్లు అందుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మార్కెట్ కూడా ఆ రేంజ్ లో ఉంది.
Image result for bharath anu nenu
బ్రహ్మోత్సవం - స్పైడర్ వంటి భారీ డిజాస్టర్స్ అందుకున్నా కూడా మహేష్ నెక్స్ట్ సినిమా బిజినెస్ పై ఏ మాత్రం ఎఫెక్ట్ పడేలా లేదు. ప్రస్తుతం మహేష్ బాబు - కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ముందుగానే శాటిలైట్ రైట్స్ ను దక్కించుకోవాలని కొన్ని ప్రముఖ ఛానెల్స్ పోటీ పడుతున్నాయి.
Image result for bharath anu nenu
ముఖ్యంగా స్టార్ మా మొత్తంగా రెండు లాంగ్వేజ్ లకు కలిపి రూ.39 కోట్ల వరకు ఆఫర్ చేసిందని తెలుస్తోంది. తెలుగు వెర్షన్ కు రూ.23 కోట్లు -  హిందీ వెర్షన్ కు రూ.16 కోట్ల వరకు చెల్లించి శాటిలైట్ హక్కులను సొంతం చేసుకోవాలని స్టార్ మా ఆలోచిస్తోందట. శ్రీమంతుడు కాంబినేషన్ కావడంతో సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అని నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ విషయం గురించి చిత్ర యూనిట్ అధికారికంగా మరికొన్ని రోజుల్లో సోషల్ మీడియా ద్వారా వివరణ ఇవ్వనుందని సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: