వర్మ తీస్తున్న సినిమా గురించి ఒక పక్క మహిళా సంఘాలు మండి పడుతున్నారు. ఇండస్ట్రీ లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంత మంది దీనిపై ఘాటుగా విమర్శలు చేస్తూ ఉండగా మరి కొంత మంది నచ్చకపోతే చూడకుండా ఉండండి అని ప్రజలకు సందేశం ఇస్తున్నారు. ఇదే కోవలో  వర్మ సినిమా కు సీనియర్ హీరో కృష్ణం రాజు అతనికి సపోర్ట్ గా మాట్లాడినాడు. 

Image result for krishnam raju

బాహుబలి సినిమా తరువాత తెలుగు సినిమా మార్కెట్ అంతర్జాతీయ స్థాయికి పెరిగింది . మన సినిమాలను అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులు చూస్తున్నారు ఇప్పుడు. కాబట్టి, ఇప్పుడు ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు చెయ్యడం తప్పక అవసరం అవుతుంది. తీయనివ్వండి చూద్దాం అన్నారు. అయితే దీనిపైనే మరొక విలేఖరి అడుగుతూ.. మరి అందరూ అంతర్జాతీయ స్థాయి సినిమాలు తీస్తుంటే వర్మ గారు మాత్రం మరీ చీప్ గా పోర్న్ సినిమాలు చెయ్యడం ఏంటి ? అని ప్రశ్నించగా ఆయన సినిమాలు నచ్చకపోతే చూడకండి. సింపుల్.

Image result for krishnam raju

 అయినా ఆయన సినిమాలు చూసి చెడిపోయిన వాళ్ళు ఉన్నారా ? లేదా ఆయన సినిమాలు చూడకుండా బాగుపడిపోయిన వాళ్ళు ఉన్నారా ? ఆయనేది చేసినా సిన్సియర్ గా చేస్తారు. కాబట్టి వర్మ సినిమా వచ్చే దాకా వేచి చూద్దాం అని అన్నారు. చూద్దాం ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: