ఇప్పటి వరకు జీఎస్టీ అంటే దేశవ్యాప్తంగా ప్రజలకు తెలిసిన   నిర్వచనం గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. కానీ  వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆపదానికి ఒక సరికొత్త అర్ధం చెపుతూ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ ]వివరణ ఇస్తూ జీఎస్టీ పదాన్ని వేరే విధంగా వాడుకుంటున్నాడు. అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో వర్మ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్  అంటూ వీడియోను తెరకెక్కించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

 RAM GOPAL VARMA GST POSTERS కోసం చిత్ర ఫలితం

 

ఈనెల 26న విడుదల కాబోతోన్న జీఎస్టీ వీడియో హాట్ టాపిక్ గా మారడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈవీడియో పైనే చర్చలు జరుగుతున్నాయి. ఈనేపధ్యంలో వర్మను టార్గెట్ చేస్తూ అనేక మంది విమర్శలు చేస్తూ ఉంటే మన తెలుగురాష్ట్రాలలోని అనేక మహిళా సంఘాలు వర్మ పై ఘాటైన విమర్శలు చేస్తూ వర్మ పై కేసులు కూడ పెడుతున్నాయి.

 RAM GOPAL VARMA GST POSTERS కోసం చిత్ర ఫలితం

ఇలాంటి పరిస్థితులలో ఇపుడు హాట్ టాపిక్ గా మారిన ఈ విషయం పై రెబల్ స్టార్ కృష్ణంరాజు షాకింగ్ కామెంట్స్ చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  వర్మ ఏ ఉద్దేశంతో జీఎస్టీని తెరకెక్కించాడనే విషయాన్ని గుర్తించాలంటూ కృష్ణంరాజు ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలున్న వర్మను విమర్శించాల్సిన పని లేదని జీఎస్టీ చూడాలని వర్మ ఎవరినీ బలవంతం చేయడం లేదు అంటూ వర్మకు బాసటగా నిలుస్తున్నాడు కృష్ణంరాజు.

KRISHNAM RAJU LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం 

అంతేకాదు ప్రస్తుతం ఇంటర్నెట్ అందరికీ అందుబాటలో ఉన్న నేపధ్యంలో ఎవరికీ ఏది కావాలంటే అది చూసే సౌకర్యం ఉన్న పరిస్థుతులలో ఒక విషయాన్ని దాచి పెట్టడం ఎంతవరకు సాధ్యం అన్న అర్ధంలో కృష్ణంరాజు కామెంట్స్ చేసాడు. ఇది ఇలా ఉండగా వర్మ చేస్తున్న ఈ లేటెస్ట్ ప్రయోగం భారతదేశ సంస్కృతికి సాంప్రదాయాలకు పెను ప్రమాదంగా అవకాశం ఉంది అంటూ అనేకమంది విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు..

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: