టాప్ హీరోలు అందరికీ సొంత బ్యానర్లు ఉన్నాయి. అయితే నందమూరి హీరోలకు సంబంధించి ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నది ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మాత్రమే. ఈ బ్యానర్ పై కల్యాణ్ రామ్ చాల సినిమాలు నిర్మించినా ఒక్క ‘జై లవ కుశ’ తప్ప మిగతా సినిమాలు అన్నీ కళ్యాణ్ రామ్ కు పెద్దగా కలిసి రాలేదు.

 BALAKRISHNA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో అన్నీ అనుకున్నట్టు జరిగితే నందమూరి సింహం బాలకృష్ణ ఒక కొత్త బ్యానర్ ను సృష్టించాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త బ్యానర్ కోసం తన సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రముఖులను కూడ కలుపుకుని ఒక ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థగా ఈ బ్యానర్ ను మార్చాలని బాలయ్య ఆలోచన అని అంటున్నారు.

 BALAKRISHNA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఇప్పటికే అమరావతి ప్రాంతంలో ఒక భారీ స్టూడియోను నిర్మించాలని బాలకృష్ణ ఆలోచనలు చేస్తున్న నేపధ్యంలో ఇప్పుడు ఈ సొంత నిర్మాణ సంస్థ కార్యక్రమాలు కూడ ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. వాస్తవానికి ఎన్టీఆర్ బయోపిక్ తోనే నిర్మాతగా మారాలనుకున్నాడు బాలయ్య. కానీ పరిస్థుతులు అనుకూలించకపోవడంతో ఈమూవీ నిర్మాణ బాధ్యతలను బాలయ్య సాయికొర్రపాటికి అప్పగించాడు అన్న వార్తలు ఉన్నాయి.

 BALAKRISHNA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

దీనికితోడు బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞను త్వరలో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్న నేపధ్యంలో ఈసొంత నిర్మాణ సంస్థ వ్యవహారాలూ హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం బాలకృష్ణ ఏవ్యాపారం మొదలు పెట్ట్టినా ఆయనతో చేయి కలపడానికి ఎందరో ప్రముఖులు సిద్ధంగా ఉన్న నేపధ్యంలో బాలయ్య ఆలోచనలలో రూపొందుతున్న ఈ కొత్త నందమూరి ప్రొడక్షన్ హౌస్ రానున్న రోజులలో టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బ్యానర్ గా మారే ఆస్కారం ఉంది అని అంటున్నారు.. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: