తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవన్ కళ్యాన్.  మెగాస్టార్ చిరంజివి తర్వాత ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో పవన్ కళ్యాన్.  కేవలం సినిమాలకే పరిమితం కాకుండా రాజకీయ రంగ ప్రవేశం చేసి సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘జనసేన’ పార్టీ పెట్టారు.  కానీ ఆ పార్టీ తరుపు నుంచి పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీ తరుపు నుంచి ప్రచారం చేశారు.  వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రత్యక్షంగా పోటీలోకి నిలబడబోతుంది. ఇక జనసేన పార్టీని బలోపేతం చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాన్ ఎన్నో ఫ్యూహాలు పన్నుతున్నారు. 

జనంలోకి జనసేనాని..! కొండగట్టు నుంచి త్వరలో యాత్ర..!!
ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో జనసేన ప్రధాన కార్యాలయాలు కూడా ఏర్పాటు చేశారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సికింద్రాబాద్ లోని సెయింట్ మేరీస్ చర్చిలో ఈ ఉదయం ప్రార్థలు చేశారు. పోలాండ్ అంబాసడర్ ఆడమ్ బురాకోవస్కీతో కలసి ఆయన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకే ఆయన తన భార్య అన్నాతో కలసి చర్చికి వెళ్లారు. తన రాజకీయ యాత్ర ప్రారంభానికి ముందు సర్వమత ప్రార్థనలు చేస్తానని పవన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. 

అంతే కాదు  తన ఆరాధ్యదైవం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి రాజకీయ యాత్ర ప్రారంభించబోతున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.   ఈ సందర్భంగా పవన్ దంపతులకు ఆడమ్ దంపతులు బహుమతులు ఇవ్వగా... పవన్ భార్య అన్నా వారిద్దరికీ బహుమతులను అందించారు. అనంతరం కొందరు ప్రత్యేక ఆహ్వానితులు, విదేశీ విద్యార్థులతో పవన్, ఆడమ్ లు ముచ్చటించారు.  ఆడమ్ బురాకోవస్కీతో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. 
Image result for పవన్ కళ్యాన్
ఇక ఆడమ్ మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ చాలా తెలివైనవారని కితాబిచ్చారు. భారతీయ సినీ రంగంలోని గొప్ప నటుల్లో పవన్ ఒకరని అన్నారు. పవన్ తో మాట్లాడిన సందర్భంగా తాను ఒక విషయాన్ని గుర్తించాని... పవన్ ఒక బ్రిలియంట్ అని, అతని మనస్సులో ఎన్నో మంచి ఐడియాలు ఉన్నాయని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: