అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా రెండు ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. మొదటి సినిమా అఖిల్ డిజాస్టర్ అవగా విక్రం కుమార్ డైరక్షన్ లో వచ్చిన హలో మాత్రం పర్వాలేదు అనిపించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ 3వ సినిమా డైరక్టర్ ఎవరన్నది కన్ ఫ్యూజ్ ఇంకా కొనసాగుతుంది. సుకుమార్, వంశీ పైడిపల్లి రేసులో ఉన్నారని తెలియగా ఇప్పుడు కొరటాల శివ పేరు వినబడుతుంది. 


ప్రస్తుతం మహేష్ తో సినిమా చేస్తున్న కొరటాల శివ ఆ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. భరత్ అనే నేను సినిమా టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలతో వస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ అసలైతే రాం చరణ్ తో సినిమా ఫిక్స్ చేసుకోగా అది ఎందుకో క్యాన్సిల్ అయ్యింది.


ఇక ఇప్పుడు కొరటాల శివ అఖిల్ సినిమాను కన్ ఫాం చేస్తున్నారట. కచ్చితంగా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందట. అఖిల్ డైరక్టర్ రేసులో కొరటాల శివ ఉండటం అక్కినేని ఫ్యాన్స్ కు కచ్చితంగా గుడ్ న్యూసే అని చెప్పొచ్చు. రచయితగా ఉన్న కొరటాల శివ డైరక్టర్ మిర్చి సినిమా నుండి జనతా గ్యారేజ్ వరకు హిట్లు కొడుతూనే ఉన్నాడు.


శ్రీమంతుడు కాంబినేషన్ లో వస్తున్న మహేష్ మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఏప్రిల్ 27న రిలీజ్ అవనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ జనవరి 26న ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టీజర్ కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. బ్రహ్మోత్సవం, స్పైడర్ ఫ్లాపుల తర్వాత మహేష్ ఈ సినిమాకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: