తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు.  గత సంవత్సరం ‘ధృవ’ తో మంచి విజయం అందుకున్న రాంచరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ చిత్రంలో నటిస్తున్నాడు.  అయితే ఈ చిత్రం సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల సమ్మర్ లో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. 
Image result for చరణ్ కి అన్నగా
అంతే కాదు హైదారాబాద్ లో చేసి కొన్ని షూట్స్ మళ్లీ గోదావరి తీరంలో రీ షూట్ చేస్తున్నట్లు టాక్ వినిస్తుంది.  ఏది ఏమైనా ఈ షూటింగ్ అయిపోతే సినిమా దాదాపు పూర్తి అయ్యినట్లే అంటున్నారు చిత్ర యూనిట్.   ఈ చిత్రం తర్వాత చరణ్ - బోయపాటి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది..ఇప్పటికే  రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.  కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, స్నేహ ఓ కీలకమైన పాత్రను పోషిస్తోంది. విలన్ గా వివేక్ ఒబెరాయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
Image result for boyapati ram charan
అంతే కాదు ఈ చిత్రంలో  కోలీవుడ్ లో స్టార్ హీరో.. తెలుగు, హిందీ, మలయాళ సినిమాల్లో నటించిన ప్రశాంత్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడట. జీన్స్ సినిమాలో ‘ప్రియా ప్రియా చంపొద్దే’ అంటూ అందాల భామ ఐశ్వర్యారాయ్‌తో రొమాన్స్ చేసిన ప్రశాంత్ ఆ తర్వాత కొన్ని సినిమాలు తీశారు..కానీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు.   
Image result for prashanth ram charan
చామంతి, తొలిముద్దు, జీన్స్, జోడీ, దొంగ దొంగ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించుకొన్న ప్రశాంత్.. ప్రముఖ నటుడు, దర్శకుడు, త్యాగరాజన్ కుమారుడు. కాగా ప్రశాంత్ మళ్ళీ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్ శుభవార్తే అంటున్నారు.  డీవీవీ దానయ్య నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చుతున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: