మెగా హీరోల లిస్టులో అల్లుఅర్జున్ ప్రస్తుతానికి కొనసాగుతూ ఉన్నా అవకాశం వచ్చిన ప్రతిసారి తన ప్రత్యేకతను చాటుకోవడానికి ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేసాడు. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తాను నటిస్తున్న సినిమాసినిమాకు తన ఇమేజ్ ని పెంచుకోవడానికి ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేసాడు.

 ALLUARJUN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఇది చాలదు అన్నట్లుగా బన్నీ దృష్టి పరోక్షంగా ‘పవనిజమ్’ పై పడినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు తమకు తాముగా ‘పవజిజమ్’ అన్న పదాన్ని క్రియేట్ చేసి దాన్ని ఒక ఇజం గా మార్చి గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో చేస్తున్న హడావిడి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో ‘బన్నీఇజమ్’ పేరుతో మరో కొత్త పదాన్ని అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాకు పరిచయం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 సంబంధిత చిత్రం

అల్లుఅర్జున్ అభిమానులకు ఇటువంటి ఆలోచనలు రావడం వెనుక ఒక ఆసక్తికర కారణం ఉంది. ఈమధ్య కాలంలో అల్లుఅర్జున్ తన అభిమానులను తరుచూ కలుసుకుంటూ ఉండటమే కాకుండా తన అభిమానుల కుటుంబాలకు సంబంధించిన సమస్యలకు చిన్నచిన్న సహాయాలు చేస్తున్నాడు అన్న వార్తలు కూడ వస్తున్నాయి. ఈమధ్య కాలంలో తన అభిమాని ఒక వ్యక్తి చనిపోతే అతడి పిల్లల భవిష్యత్ చదువు ఖర్చులు అంతా తానే భరిస్తానని అల్లు అర్జున్ ముందుకు వచ్చాడని టాక్.

 ALLUARJUN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

అదేవిధంగా అల్లు అర్జున్ తన సామాజిక స్పృహను చాటుకుంటూ ఆమధ్య సుకుమార్ దర్శకత్వంలో సామాజిక చైతన్యానికి సంబంధించిన ఒక షార్ట్ ఫిలింలో కూడ నటించాడు. ఇలాంటి విషయాలు అన్నీ పరిగణలోకి తీసుకుని హైలెట్ చేస్తూ బన్నీ అభిమానులు ‘బన్నీఇజమ్’ వాదాన్ని ప్రమోట్ చేస్తే బాగుంటుంది అని ఒక అభిమాని చేసిన సూచనకు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకు వస్తున్న అల్లు అర్జున్ అభిమానులు ఈ ‘బన్నీఇజమ్’ బాగా ప్రమోట్ చేసి ‘నాపేరు సూర్య’ విడుదల సమయానికి విపరీతమైన హైక్ తీసుకు వచ్చే ఆలోచనలు చేస్తున్నట్లు టాక్..



 


మరింత సమాచారం తెలుసుకోండి: