తెలుగు ఇండస్ట్రీలో కి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత నాని నటించిన ‘ఎవడే సుబ్రమాణ్యం’లో మంచి పాత్రలో కనిపించాడు.  ఆ తర్వాత ‘పెళ్లిచూపులు’ చిత్రంలో ఒక్కసారే స్టార్ డమ్ వచ్చింది..ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’తో మనోడీ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.  అయితే ‘అర్జున్ రెడ్డి’ చిత్రం మొదటి నుంచి ఎన్నో వివాదాలకు తెరలేపుతూ వచ్చింది.  లిప్ లాక్ సీన్లు..కొన్ని వల్గర్ డైలాగ్స్ ఇలా ఆ చిత్రంలో కాంట్రవర్సీ విషయాలపై రోజూ చర్చలు జరుగుతుండేవి..మొత్తానికి సినిమా రిలీజ్ కావడం సూపర్ డూపర్ హిట్ కావడం జరిగిపోయింది. 
Image result for arjun reddy
తాజాగా హైదరాబాద్‌ పోలీసులకు అర్జున్‌ రెడ్డి అదే నండీ విజయ్ దేవరకొండ సారీ చెప్పాడు. అదేంటీ విజయ్ దేవరకొండ ఏం తప్పు చేశాడని..సారీ చెప్పాడు..ఒకవేళ ఆ తప్పు చేస్తే మీడియాలో ఈ పాటికి టాం..టాం..కావాల్సిందే అని అనుకుంటున్నారా..! అబ్బే మనోడు కావాలని ఏమీ తప్పు చేయలేదు..‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో  విజయ్ దేవరకొండ ఫుట్‌ బాల్‌ గేమ్‌ ఆడటానికి స్పోర్ట్స్‌ డ్రెస్‌లోనే హెల్మెట్‌ లేకుండా రాయల్ ఎన్ఫీల్డ్‌ బైక్‌పై స్మోక్‌ చేస్తూ వెళ్లే ఓ సీన్‌ మనందరికి గుర్తు ఉండే ఉంటుంది.
Image result for arjun reddy
అయితే హెల్మెట్‌ ప్రాధాన్యతను అందరికీ తెలియజేయడానికి హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డి పోస్టర్‌లో విజయ్‌ దేవరకొండ హెల్మెట్‌ ధరించకుండా ఉన్న ఫోటోను, గ్రాఫిక్స్‌ సహాయంతో అదే ఫోటోకు హెల్మెట్‌ పెట్టారు. ట్రాఫిక్ నిబంధనల్లో ఏది సరైంది, ఏది తప్పు అనేది కూడా టిక్‌ పెట్టి ఓ ఫోటోను హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు ఓ ట్విట్ చేశారు. ప్రపంచంలో ఏటా లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు.
Image result for arjun reddy
వీరిలో దాదాపు సగం మంది ద్విచక్ర వాహనాలు నడిపేవారే. వీరిలోనూ తలకు బలమైన గాయాలు తగలడం వల్ల చనిపోయేవారి సంఖ్య మరీ ఎక్కువగా వున్నట్టు వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది.  ముఖ్యంగా బైక్ నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని దాని యొక్క సారాంశం. కేవలం హెల్మెట్ పెట్టుకోకపోవడం అనే ఒకే ఒక్క పొరపాటు ప్రతి రోజూ కొన్ని వందల మంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంటోంది.
Image result for arjun reddy
దీంతో తలకు గాయాలవ్వడం వల్లే ఎక్కువ మంది ద్విచక్రవాహనదారులు మృతిచెందుతున్నారని ట్విట్టర్‌లో అర్జున్‌ రెడ్డి ఫోటోతో పాటూ పోస్ట్ చేశారు. దీనికి బదులుగా సారీ మామా.. ఇప్పటి నుంచి పక్కా అంటూ విజయ్‌ దేవరకొండ ఓ ట్విట్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: