వ‌రుణ్‌ తేజ్‌ హీరో గానటిస్తున్న ‘తొలిప్రేమ‌’ ఆడియో ఫంక్షన్ లో ద‌ర్శకుడు వెంకీ అట్లూరిని టార్గెట్ చేస్తూ వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ కు  ఆ ఫంక్షన్ కు వచ్చినవారు అందరూ తెగ నవ్వు తెప్పించాయి. ఈసినిమా దర్శకుడు వెంకీ తన వద్దకు వచ్చి  ఈ సినిమాకు  ‘తొలిప్రేమ' అని  టైటిల్ పెడదాము అని చెప్పినప్పుడు తనకు  భయమేసి ఆ టైటిల్ పెట్టుకుంటే తేడా ఏమైనా వస్తే పగిలిపోతుందని తాను దర్శకుడిని బెదిరించాను అంటూ జోక్ చేసాడు.

 వెంకీని ఆపాను, నా కోసం ఆగాడు

ఇదే సందర్భంలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ ‘తొలి ప్రేమ' చిత్రం తన బాబాయ్ పవన్ ఐకానిక్ ఫిల్మ్ అంటూ ఆ సినిమాకు ఎంత రెస్పెక్ట్ ఉందో తనకు తెలుసు అని అంటూ ఆ గౌరవాన్ని పాడుచేస్తే మెగా అభిమానులు ఊరుకోరు అన్న విషయాన్ని దర్శకుడు వెంకీని భయపెట్టి వివరించాను అంటూ తన బెదిరిపుల విషయం బయటపెట్టాడు. అంతేకాదు ఈ సినిమా చూసిన తర్వాత ఎవరూ నిరాశ  పడరు అని చెపుతూ ‘తోలి ప్రేమ’  టైటిల్ ఈ  సినిమాకు యాప్ట్ అని అంటారు అని అంటూ వరుణ్ తేజ్ ఈ సినిమా పై అంచనాలు పెంచాడు.   

 హీరోయిన్లను వెతకడం చాలా కష్టం 

ఇదే సందర్భంలో వరుణ్ తేజ్ హీరోయిన్ పై కూడ జోక్ చేసాడు తనకు హీరోయిన్స్ వెత‌క‌డం అంటే చాలా క‌ష్టం అనిఅంటూ తన హైట్‌కు సరిపోయే హీరోయిన్ దొరకడం కష్టం అని అంటూ   తొలిసారి తన  హైట్‌ కు స‌రిపోయేలా రాశి ఖ‌న్నా దొరికింది అంటూ ఆమె పై కూడ జోక్ చేసి అందరినీ నవ్వించాడు. ఇది ఇలా ఉండగా ఈ మూవీకి సంబంధించి తమన్ అందించిన ఆడియో కు మంచి స్పందన వస్తున్న నేపధ్యంలో 1998లో పవన్ ‘తొలిప్రేమ’ ఎలాంటి సెన్సెష‌న్‌ ను క్రియేట్ చేసిందో 2018లో వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ కూడ మరో సెన్సెష‌న్ ను క్రియేట్  చేస్తుందా అన్న అంచనాలు పెరుగుతున్నాయి.

 అంతా బాగా చేశారు

ఈ అంచనాలే నిజం అయితే ‘ఫిదా’ తరువాత మరో సక్సస్ సాధించి వరుణ్ తేజ్ టాప్ యంగ్ హీరోల రేసులోకి చేరిపోతాడు. అయితే పవన్ ‘తొలిప్రేమ’ కు వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ కు పోలికలు చూపిస్తూ అనేక కామెంట్స్ వస్తాయి కాబట్టి ఆ కామెంట్స్ ను తట్టుకుని నిలబడే స్థాయి వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ కు ఉన్నాయా అన్నదే ప్రశ్న..











మరింత సమాచారం తెలుసుకోండి: