ఈవారం విడుదల కాబోతున్న ‘భాగమతి’ సినిమాను ప్రమోట్ చేస్తూ అనుష్క తన కెరియర్ గురించి ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం గురించి అనేక ఆసక్తికర విషయాలను ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేర్ చేసింది. ఇదే సందర్భంలో ఆమె ప్రభాస్ తో తన సాన్నిహిత్యం గురించి వివరిస్తూ ప్రభాస్ పెళ్లి వ్యవహారం పై ఆసక్తికర కామెంట్స్ చేసింది స్వీటి.

 Image may contain: 1 person, smiling

ప్రభాస్ తనకు మధ్య ఉన్న సాన్నిహిత్యం కేవలం స్నేహం మాత్రమే అని చెపుతూ తనకు ప్రభాస్ కు మధ్య కంఫర్ట్ లెవల్స్ బాగా ఉన్నాయి కాబట్టి తామిద్దరం కలిసి ఎక్కువ సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాము అంటూ ప్రభాస్ తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించడానికి ప్రయత్నించింది. ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ తాను ప్రభాస్ వ్యక్తిగత జీవితం గురించి పట్టించుకోనని కనీసం ఒక స్నేహితురాలిగా కూడ ప్రభాస్ కు తాను ఎటువంటి సలహాలు ఇవ్వనని కేవలం తమ మధ్య ఉన్న స్నేహం ప్రోఫిషినల్ స్నేహం మాత్రమే అని అంటోంది ఈ దేవసేన.

 Image may contain: 1 person, smiling

ఇదే సందర్భంలో ప్రభాస్ తాను నటించిన ‘బాహుబలి’ సినిమాలోని పాత్రల గురించి మాట్లాడుతూ ‘నేను దేవసేన కాదు ఆయన బాహుబలి కాదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు ఎవరితో మాట్లాడాలి అన్న సిగ్గు ఎక్కువ అని చేపుతూ గుర్రాలు అంటే భయపడే తనకు గుర్రపు స్వారీలు చేస్తూ రాజకుమరీలా కనిపించే దేవసేన పాత్రలో నటించినంత మాత్రాన నిజ జీవితంలో దేవసేనగా అయిపోనని కామెంట్స్ చేసింది.

 Image may contain: 1 person, smiling, close-up

అదేవిధంగా ఎవరితోను పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడని ప్రభాస్ విపరీతంగా కండలు పెంచి అమరేంద్ర బాహుబలిలా మారినంత మాత్రాన నిజ జీవితంలో ప్రభాస్ బాహుబలి అయిపోతాడా అంటూ జోక్ చేసింది. ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ తాను పెళ్ళి చేసుకునే వ్యక్తి చాల అందంగా తనకన్నా పొడవుగా నిజాయితీతో కూడిన మంచి వ్యక్తిగా ఉండాలని తాను కోరుకుంటున్నా ఆ కోరికలు తీరే భర్త తనకు నిజంగా దొరుకుతాడా అన్న అనుమానం ఉంది అంటూ తన పై తానే జోక్ చేసుకుంది. కనక్షన్ లేనిచోట ప్రేమ పుట్టదు అంటూ సినిమాలలో తాను హీరో పై చూపించే ప్రేమను చూసి తన పెళ్లి గురించి రకరకాల ఊహాగానాలను చేయవద్దని చెపుతోంది అనుష్క.. 


మరింత సమాచారం తెలుసుకోండి: