వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. తీసే సినిమాలనుండి చేసే ట్వీట్ల వరకు వివాదాలను సృష్టిస్తుంటాడు. మొన్న కడప రెడ్ల చరిత్ర అనే థీమ్ తో కొత్త వెబ్ సీరీస్ తీయబోతున్నాను అని ట్రైలర్ విడుదల చేసి రెడ్డి జాతి ఆగ్రహానికి లోనయ్యాడు. నిన్న మహేష్ కత్తికి మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేయడం పవన్ ఫ్యాన్సుకు ఆగ్రహాన్ని తెప్పించింది. తాజాగా అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా తో ఒక సినిమా షూట్ చేసి మళ్ళీ వార్తల్లో నిలిచాడు.


అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా తో గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ ఆనే పేరుతో ఒక సినిమాలాంటి దానిని తీశాడు. కాగా దీనికి కీరవాణి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఏకంగా ఒక పోర్న్ స్టార్తో సినిమా తీయడం ఆధ్యాత్మిక చింత కలిగిన భారత దేశ ప్రజలకు మింగుడుపడడం లేదు. ఆందుకే ఈ సినిమా విడుదల అవకుండా ఆపివేయాలని అన్ని ప్రజాసంఘాల నుండి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిణామాలను ముందుగానే ఊహించిన వర్మ షూటింగును కూడా యూరప్ లోనే చేశాడు. మనదేశంలో సెన్సార్ బోర్డు ఒప్పుకోదు కాబట్టే యూట్యూబ్ లో విడుదల చేయాలని ముందస్తు ప్రణాళికలో ఉన్నాడు.


కాగా ఈ చిత్రంపై వస్తున్న విమర్శలను చర్చించడానికి టీవీ9 ఛానెల్ కు వెళ్లాడు. అక్కడ విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల,వర్మతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నంతసేపు ఆయన అవేమి పట్టించుకోకుండా తన మొబైల్ ను చూస్తూ ఉండిపోయాడు. ఆమె ప్రశ్న అడగడం అయిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ , మీరు ఇంతవరకు మొబైల్ లో పోర్న్ చూసారు కదా అని వర్మను అడుగగా ఆయన అవును అని తాపీగా సమాధానం చెప్పారు. ఛీఛీ ఇదేం పాడుబుద్ధి అని కొందరు విమర్శిస్తుంటే, మరీ లైవ్ లో కాకుండా ఇంటర్వ్యూ అయ్యాక చూడొచ్చుగా అని కొందరు అభిప్రాయపడుతునారు. పబ్లిసిటీ కోసం వర్మ ఏదయినా చేస్తాడు అని అనుకోవడం మరికొంతమంది వంతు అయింది. ఏదిఏమయినా ఈనెల 26 రిపబ్లిక్ డే రోజున సినిమాను యూట్యూబ్ లో విడుదల చేస్తానని తేల్చిచెప్పాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: