టీమిండియా సాధించిన ఎన్నో విజయాల్లో ఇర్పాన్ పటాన్ కీలక పాత్ర పోషించారు..తన బౌలింగ్ తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించేవాడు.  అలాంటి క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఉత్తమ నటుడు అవార్డు కైవసం చేసుకున్నాడు. అదేంటీ ఇర్ఫాన్ పఠాన్ సినిమాల్లో ఎప్పుడు నటించాడు..పైగా ఉత్తమ నటుడి అవార్డు కూడా ఇచ్చారా..అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.  అసలు విషయం తెలిస్తే..నిజంగా షాక్ తింటారు. శనివారం ముంబైలో 63వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
u can send the award to me at my home, Irfan Pathan - Sakshi
వాస్తవానికి ఇర్ఫాన్‌ పఠాన్‌ సినిమాల జోలికి వెళ్లలేదు. ఏ సినిమాలోనూ నటించలేదు. ప్రముఖ మ్యాగజైన్‌ ‘ఫెమినా’ తప్పిదం వలన ఇర్పాన్ పటాన్ ఉత్తమ నటుడు అయ్యాడు. "హిందీ మీడియం" సినిమాకు గానూ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ కు ఉత్తమ నటుడు అవార్డు దక్కింది.
Image result for irfan pathan
ఐతే, మ్యాగజైన్‌ ‘ఫెమినా’ తన ట్విటర్‌లో ఇర్ఫాన్‌ ఖాన్‌ పేరుకు బదులు ఇర్ఫాన్‌ పఠాన్‌ అని పేర్కొంది.  అయితే తప్పు తెలుసుకొని తర్వాత దానిని డిలీట్ చేసింది. అయితే అంతలోపే ఇర్ఫాన్ పఠాన్ దీనిపై స్పందించాడు. అయ్యో.. అవార్డు అందుకోవడానికి అక్కడికి రాలేకపోయా.. మీరు ఇంటికి పంపిస్తే తీసుకుంటా అంటూ ట్విట్టర్‌లో సెటైర్ వేశాడు ఇర్ఫాన్ పఠాన్. 

మరింత సమాచారం తెలుసుకోండి: