సినిమా హీరోలను దేవుళ్లుగా సంభోదించడం తెలుగు పరిశ్రమలో చూస్తూనే ఉంటాం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఆయన ఫ్యాన్స్ దేవుడు అంటూ ఆరాధిస్తారు. ఇక ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను కూడా దేవుడు అంటున్నారు. ఇలా అనేది ఫ్యాన్స్ కాదండి బాబు.. స్వయానా డైరక్టరే అంటున్నాడు. ఇంతకీ అతను అలా ఎందుకు అన్నడు అంటే వివారాల్లోకి వెళ్లాల్సిందే.


పిల్ల జమిందార్ తో దర్శకుడిగా సక్సెస్ అందుకున్న అశోక్ ఆ తర్వాత సినిమాలు చేసినా హిట్ మాత్రం కొట్టలేదు. ప్రస్తుతం అనుష్క లీడ్ రోల్ చేసిన భాగమతి సినిమాను డైరెక్ట్ చేశాడు అశోక్. ఈ సినిమా తెరకెక్కడానికి ప్రభాస్ మొదటి కారణమని చెప్పుకొచ్చాడు. ఎలాగైనా గెలవాలనుకుంటే మోసం చేయొచ్చని.. కాని తాను గెలుస్తూ ఇతరులను గెలవాలనుకోవడం దైవత్వమని.. అది ప్రభాస్ లో ఉందని అందుకే అతను నాకు దేవుడంటున్నాడు అశోక్.


తాను భాగమతి కథ రాసుకుని ప్రభాస్ కే వినిపించగా.. యువి క్రియేషన్స్ కు.. అనుష్కకు చెప్పి ఒప్పించింది మాత్రం ప్రభాసే అట. ఈ విషయాన్నే చెబుతూ ప్రభాస్ దేవుడు అంటున్నాడు అశోక్. ఇక ఈ సినిమాతో మళ్లీ అనుష్క తన సత్తా చాటుతుందని.. ఈ సినిమాకు పడిన కష్టం చూసి షాక్ అయ్యానని అంటున్నారు. స్వీటీ కెరియర్ లో ఇది మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని అంటున్నాడు అశోక్.


ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా వస్తున్న భాగమతి సినిమా అరుంథతి సినిమా రేంజ్ లో హిట్ సాధిస్తుందని అంటున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: