కింగ్ నాగార్జున, వర్మ కాంబో సినిమా అంటే అందరికి వారి కలయికలో వచ్చిన శివ సినిమానే గుర్తుకు వస్తుంది. టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ మూవీగా సంచలన విజయం అందుకున్న శివ నుండి వర్మ నాగార్జునలది మంచి రిలేషన్ తో ఉన్నారు. అంతేకాదు గోవిందా గోవిందా తర్వాత 28 ఏళ్ల తర్వాత మళ్లీ నాగ్ వర్మలు కలిసి ఓ సినిమా చేస్తున్నారు.


వర్మ స్వీయ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున పోలీస్ పాత్రలో కనిపిస్తాడట. ఎంకౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపిస్తాడని ఎక్స్ క్లూజివ్ టాక్. ఇక ఈ సినిమాకు టైటిల్ గా శివ-2 అని కొద్దిరోజులు అనగా.. సిస్టెం, గన్ అంటూ రకరకాల టైటిల్స్ వినబడ్డాయి. అయితే ఫైనల్ గా ఈ సినిమాకు శపథం అనే టైటిల్ ఫిక్స్ చేశారట. 


సోలో హీరోగానే కాదు మల్టీస్టారర్స్ ను ఎంకరేజ్ చేస్తూ సూపర్ ఫాంలో ఉన్న నాగార్జున వర్మ మార్క్ సినిమాతో శపథం చేస్తున్నాడు. మరి నాగార్జునతో కలిసి వర్మ చేస్తున్న ఈ శపథం ఏమేరకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాలో నాగార్జున లుక్స్ కూడా రఫ్ గా కనిపిస్తాయి. అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. 


ప్రస్తుతం నాగార్జున తనయుల కెరియర్ మీద దృష్టి పెట్టాడు. అందుకే ప్రస్తుతం వర్మ సినిమా పూర్తి కావొస్తున్నా తన తర్వాత సినిమా ఏంటన్నది ఇంకా డిక్లేర్ చేయలేదు. రాజు గారి గది-2 కూడా నిరాశ పరచడంతో నాగార్జున కథల విషయంలో కాస్త జాగ్రత్తపడుతున్నడట. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో నానితో మల్టీస్టారర్ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందట.



మరింత సమాచారం తెలుసుకోండి: