టాప్ యంగ్ హీరోల సినిమాల పై విపరీతమైన భారీ బడ్జెట్ పెరిగిపోవడంతో అత్యథిక థియేటర్లలో వారి మూవీలను రిలీజ్ చేస్తూ వీలైనంత వరకు ఆ మూవీ విడుదల అయిన మొదటి 3రోజుల్లోనే  వీలైనంత రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆ ఆలోచనలకు అల్లుఅర్జున్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘నా పేరు సూర్య’ సినిమా విషయంలో ఈ మూవీ నిర్మాతలు అడ్వాన్స్ ఆలోచనలలో  ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ అత్యథిక థియేటర్లతో పాటు అత్యథిక భాషల్లో కూడా విడుదలచేసే సరికొత్త వ్యూహం రచిస్తున్నారు.

 ALLU ARJUN LATEST PHOTOS IN NAA PERU SHIVA PHOTOS కోసం చిత్ర ఫలితం

తెలుస్తున్న సమాచారం మేరకు అల్లు అర్జున్ నటిస్తున్న ‘నా పేరు సూర్య’ సినిమాను ఏకంగా 7 భాషల్లో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ బన్నీ నటిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠి, భోజ్ పురి భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

 సంబంధిత చిత్రం

అయితే ఈ సినిమాను ఇంత భారీగా విడుదల చేయడానికి ఒక రీజన్ కూడా ఈసినిమా నిర్మాతలు చెపుతున్నట్లు తెలుస్తోంది. ‘నా పేరు సూర్య’ సినిమా కథ యూనివర్సల్ సబ్జెక్ట్ అని ఈ మూవీ నిర్మాతలు భావిస్తూన్న నేపధ్యంలో భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల ఆడియన్స్ ఈ సినిమాకు  కనెక్ట్ అవుతారని నిర్మాతల అభిప్రాయం అని అంటున్నారు.

 ALLU ARJUN LATEST PHOTOS IN NAA PERU SHIVA PHOTOS కోసం చిత్ర ఫలితం

దీనితో ఒకేసారి 7 భాషల్లో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నాల వల్లే ఈ మూవీ రిలీజ్ డేట్ ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లుఅర్జున్ కు నడుస్తున్న క్రేజ్ ను అదే విధంగా విపరీతమైన పోటీ ఉండే సమ్మర్ రేస్ ను దృష్టిలో పెట్టుకుని భారీ కలక్షన్స్ ను టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ సినిమా రిలీజ్ విషయంలో వాయిదా వేసి ఈభారీ మార్పులు చేసినట్లు టాక్..

 


మరింత సమాచారం తెలుసుకోండి: