దేశవ్యాప్తంగా 'పద్మావత్' విడుదలను అడ్డుకోవాలని కర్ణిసేన కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే విడుదల తేది దగ్గరపడుతుండగా ఈ విషయంలో కాస్త వెనక్కు తగ్గింది కర్ణిసేన.  పద్మావత్ సినిమా విడుదలను ఆపాలంటూ మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలంటూ ఈ రెండు రాష్ర్టాలు పిటిషన్‌లో కోర్టును కోరాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ పిటిషన్లపై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.
Image result for karnisena
పద్మావత్ చిత్రం జనవరి 25న విడుదల చేయనున్నట్లు భన్సాలీ ప్రొడక్షన్స్ ప్రకటించిన విషయం విదితమే. హిందీ, తమిళ్, తెలుగు భాషాల్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. కొన్ని రాష్ట్రాలు ముందస్తుగానే ఆ సినిమాపై నిషేధం విధించాయి. పద్మావత్ సినిమా విడుదలను ఆపాలంటూ.. హర్యానా కురుక్షేత్రలోని ఓ మాల్‌పై 20 నుంచి 22 మంది యువకులు ఆదివారం రాత్రి దాడి చేసిన విషయం తెలిసిందే. గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలంటూ ఈ రెండు రాష్ట్రాలు పిటిషన్‌లో కోర్టును కోరాయి.
Image result for karnisena
మధ్యప్రదేశ్, రాజస్థాన్ పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. కాగా, ఈ చిత్ర ప్రదర్శనకు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే విడుదల తేది దగ్గరపడుతుండగా ఈ విషయంలో కాస్త వెనక్కు తగ్గింది కర్ణిసేన. ఈ సినిమా స్పెషల్ షోను చూసేందుకు తాము సిద్ధమని ఉత్తరప్రదేశ్ కర్ణిసేన లీడర్ లోకేంద్ర సింగ్ కల్వి చెప్పారు.
Image result for karnisena
తాము సినిమాను చూడమని ఎప్పుడూ చెప్పలేదని, విడుదలకు ముందు ఈ చిత్రాన్ని చూసేందుకు తాము రెడీగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే 'పద్మావత్‌'లో రాజ్‌పుత్‌లను కించపరచలేదని, ఈ సినిమాను చూసేందుకు రావాలంటూ శ్రీ రాజ్‌పుత్ కర్ణిసేన, రాజ్‌పుత్ సభ జైపూర్‌ సభ్యులకు భన్సాలీ ప్రొడక్షన్ జనవరి 20న లేఖ రాసిన విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: