ఆ మద్య టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీని ఒక్క కుదుపు కుదిపేసింది..‘సుచీ లీక్స్’. కోలీవుడ్ లో పెను సంచలనాలకు కేంద్ర బింధువుగా నిలిచింది పాప్ సింగర్ సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ ద్వారా సెలబ్రెటీలకు సంబంధించిన బూతు బాగోతం మొత్తం ఎపిసోడ్ల లెక్క బయటకు వచ్చాయి. ఆ మద్య నెటిజన్లు ఎక్కువగా పోస్ చేసిన అంశం ఏదైనా ఉందీ అంటే..అది సుచీ లీక్స్ అనే చెప్పొచ్చు. అయితే సుచిత్ర మానసిక పరిస్థితి బాగా లేదని ఆమె స్వయంగా ఆమె భర్త తెలిపారు. అయితే  ఇలాంటి ట్వీట్లపై రకరకాల వివరణ ఇచ్చింది సుచిత్ర.
Image result
తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని ఒకసారి, కాదని ఒక సారి.. ట్వీట్ పెట్టింది. మరి వరసగా వివాదాస్పద ట్వీట్లు వస్తున్నాయి కదా..హ్యాక్ అయి ఉంటే, ఈ అకౌంట్ ను డిలీట్ చేసుకోవచ్చు కదా.. అని అడిగితే, ఆ అవసరం లేదని సుచిత్ర అన్నారు.  మరోవైపు తనను నమ్మే వారు మాత్రమే తనతో ఉంటారు, నమ్మని వారు ఉండరని ఆమె తేల్చి చెబుతోంది స్టార్ హీరోలు, హీరోయిన్ల పర్సనల్ ఫొటోలు ఆమె ట్విట్టర్ నుండి షేర్ అయ్యాయి. అంతే కాదు ఆ మద్య తనపై తమిళ హీరో ధనుష్, యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌లు అత్యాచారానికి పాల్పడ్డారంటూ సుచిత్ర ఆరోపించింది.
Image result
తనకు ఇచ్చిన కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపారని, మగతలోకి జారుకోగానే ఇద్దరూ తనపై పాశవికంగా ప్రవర్తించారని సంచలన కామెంట్స్ చేసింది.ఇక సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి పేరు కూడా ఉండటం చాలామందిని షాక్ కి గురిచేసింది.చిన్మయి కి సంబధించి సంచలన వ్యాఖ్యలు చేసింది సుచిత్ర. ”డ్యూడ్.. పెళ్లికు ముందు నాలుగు అబార్షన్ లు చేసుకున్నావ్. డాక్టర్ రిపోర్ట్లు సహా నా దగ్గర ఆధారాలు వున్నాయి బయటపెట్టమంటావా? అంటూ ట్విట్టర్ లో హెచ్చరించింది సుచిత్ర.

ఇలా పలువురిపై రక రకాల కామెంట్స్ చేసి సుచిత్ర కొంత కాలంగా వివాదాలకు దూరంగా వెళ్లిపోయింది.  తాజాగా ఎలా వెళ్లానో మళ్లీ అలాగే వచ్చా.. పలువురి నటీనటుల ఆంతరంగిక వ్యవహారాలు మళ్లీ విడుదల కానున్నాయి’ అంటూ వైరల్‌గా వ్యాపిస్తున్న వీడియో కోలీవుడ్‌లో కలకలం రేపుతోంది. అయితే గాయని సుచిత్ర ట్విట్టర్‌ ద్వారా వెలువడిన ఈ వ్యవహారాలు కలకలం రేపాయి. అయితే తనకు వీటితో ఎలాంటి సంబంధం లేదని, తన ట్విట్టర్‌ ఖాతాను హ్యాక్‌ చేశారని సుచిత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు


మరింత సమాచారం తెలుసుకోండి: