ముంబైలో బాలీవుడ్‌ తారల ఇష్టదైవం.. సిద్ధివినాయకుడిని సామాన్యులతో పాటు పలువురు బాలీవుడ్‌ తారలు తరచుగా దర్శించుకుంటారు. అమితాబ్‌బచ్చన్‌, అజయ్‌దేవ్‌గణ్‌, సల్మాన్‌ఖాన్‌, దీపికా పదుకొనె. సిద్ధివినాయక మందిరం దేశంలోని అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే ఆలయాల్లో ఒకటిగావుంది. ఏటా హుండీ ద్వారా వచ్చే ఆదాయంలో కోట్లలో వుంటుంది. బంగారం కూడా ఎక్కువగా విరాళాల రూపంలో రావడం గమనార్హం. ఆదాయాన్ని పలు సాంఘికసేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.
Image result for mumbai siddhi vinayaka
భారత దేశంలో ఎన్నో వివాదాలు ఎదుర్కొంటున్న  సంజయ్‌ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చారిత్రక సినిమా ‘పద్మావత్’. ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఎన్నో వివాదాలు, దాడులు రక రకాల ఇబ్బందులు పడుతూ వస్తుంది.  అంతే కాదు గత సంవత్సరం డిసెంబర్ 1 న రిలీజ్ కావాల్సి ఉండగా చిత్రంపై కర్ణిసేన అభ్యంతరాలు పెడుతూ వచ్చింది. అడుగడుగునా కర్ణిసేన ఆధ్వర్యంలో రాజ్‌పుత్‌లు ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటమే.

ఇప్పటికే పలుచోట్ల ఈ సినిమాను ప్రదర్శిస్తారని భావించిన థియేటర్లపై కర్ణిసేన దాడులకు దిగుతోంది.ఈ వివాదాల నడుమ వచ్చే గురువారం ‘పద్మావత్‌’ చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ పోషించిన దీపికా పదుకోన్‌ మంగళవారం ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు.
Image result for padmavati movie\
కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆమె ఆలయానికి వచ్చారు. ఆలయంలో వినాయకుడికి ప్రత్యేక పుజలు నిర్వహించారు. అయితే ‘పద్మావత్‌’ సినిమాలో టైటిల్‌ రోల్‌ పోషించిన దీపికపై ఆగ్రహంగా ఉన్నారు..ఆ మద్య ఓ అడుగు ముందుకు వేసి దీపిక తల నరికితే..కోటి రూపాయలు ఇస్తామని ప్రకటించడం పెద్ద వివాదం అయ్యింది.  ఈ నేపథ్యంలో దీపిక కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆలయాన్ని దర్శించుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: