రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం చివరి దశలో షూటింగ్ జరుపుతుంది ఈ చిత్ర యూనిట్. షూటింగ్ దశలో ఉండగానే ఈ చిత్రం భారీ అంచనాలను, ఆసక్తిని నెలకొల్పుతుంది. 80 ల దకంలో ఉన్న ప్రజల జీవితాలను, అప్పటి అనురాగాలను, పల్లె వాతావరణాన్ని మన కళ్ళకు కట్టినట్లు చూపించడానికి ఇంక చివరిదశలో ఉన్నాడు ఈ జీనియస్ దర్శకుడు.


రంగస్థలం లో ఒక పాత్రలో హాట్ యాంకర్ అనసూయ నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. షూటింగ్ తొలినాళ్లలో తన వేషధారణ ఎలా ఉండబోతున్నదనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఒక ఫోటో పెట్టి అందరిలోనూ ఆసక్తి లేపింది. పక్కనే ఒక మట్టికుండ, ఇక తన కాళ్ళకి ఆ కాలంలో ఆడవారు వేసుకొనే పట్టీలు ధరించిన ఫోటో పెట్టి ఇది ఒక పాతకాలపు నేపథ్యంతో కొనసాగే చిత్రం అనే విషయాన్ని మనకు చెప్పకనే చెప్పింది. అంతేగాక షూటింగ్ సమయంలో లీకైన రాంచరణ్ ,సమంతల ఫొటోలు,రంగస్థలం సెట్ ఇవన్నీ పాతకాలపు నేపథ్యంతో సరితూగేలా ఉండడంతో అది పక్కా అయిపొయింది.


అయితే గతంలో రంగస్థలం లో అనసూయ, రాంచరణ్ కు అత్తగా నటించబోతున్నదనే పుకారు విచ్చలవిడిగా షికారు చేసింది. అయితే దీనిపై చిత్ర బృందం కానీ లేక అనసూయ కానీ ఏ రకంగాను స్పందించలేదు. కానీ ఈ మధ్య ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటిస్తుండగా ఒక అభిమాని మీరు అత్తగా నటుస్తున్నారన్నమాట నిజమేనా అని అడగ్గా అలాంటిదేమి లేదు ,అది వట్టి రూమర్ అని తేల్చిచెప్పింది. అయితే ఆమెది అత్త పాత్ర కాదు, ఆమె చేసే పాత్ర పేరు రంగమ్మత్త అని ఇంకో రూమర్ చక్కర్లు కొడుతోంది. సినీ కెరీర్ ఆరంభంనుండి వైవిధ్యమైన పాత్రలు చేస్తున్న అనసూయకు ఈ పాత్ర మరింత పేరును, యింకా కొన్ని సినిమా ఆఫర్లను అందిస్తుందంట. కాగా ప్రస్తుతం చివరిదశలో ఉన్న షూటింగ్ ను ఈ చిత్ర బృందం వేసవికి కానుకగా అభిమానుల ముందుకి తీసుకురానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: