మాట వరసకన్నాడా.. లేక అధికారికంగా చెప్పాడా కాని పవన్ సినిమా చాప్టర్ క్లోజ్ అనగానే అనూహ్యంగా వెండితెర మీద పవర్ స్టార్ అన్న టైటిల్ ఇక చూడటం కష్టమా అన్న ఆలోచన వచ్చింది. అయితే వరికి వారు నెక్ష్ట్ పవర్ స్టార్ తామే అనుకుంటూ ఉండగా ఆ స్క్రీన్ నేం మోసే దమ్ము ఎవరికి ఉంది అని పవర్ స్టార్ అభిమానులు చర్చించుకుంటున్నారు.


అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరగేట్రం చేసిన కళ్యాణ్.. ఫ్యాన్స్ మొదటగా పవన్ కళ్యాణ్ చేశారు. ఇక తనలోని ఈజ్ చూసి ఈ పవర్ కు తగ్గట్టుగా పవర్ స్టార్ అన్న స్క్రీన్ నేం తగిలించేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వినపడితే చాలు మెగా ఫ్యాన్స్ లో పూనకాలు వచ్చే పవర్ వస్తుంది. 


ఇక పవన్ సినిమాలను వదిలేస్తానని పవన్ ప్రకటించగానే సినిమా అభిమానులు కాస్త దిగాలు పడుతున్నా.. ఇప్పుడు వారి డిస్కషన్ పవర్ స్టార్ స్క్రీన్ నేం మోసే యువ హీరో ఎవరు అని.. మెగా హీరోల్లో ఇప్పటికే మెగా పవర్ స్టార్ ఉన్నాడు. పవన్ సినిమాలు చేయకుంటే కచ్చితంగా రాం చరణ్ కే బలం పెరుగుతుంది. పవర్ స్టార్ అభిమానులంతా చరణ్ కు సపోర్ట్ ఇస్తారు.


ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే.. చెప్పను బ్రదర్ అంటూ పవన్ ఫ్యాన్స్ తో పెట్టుకున్న బన్ని ఆ తర్వాత సర్ధుబాటు చర్యలు చేసినా సరే లాభం లేకుండా పోయింది. ప్రస్తుతం పవన్ పొలిటికల్ టూర్ గురించి చరణ్ తో పాటుగా వరుణ్, సాయి ధరం తేజ్ ప్రస్థావించినా అల్లు అర్జున్ అలియాస్ బన్ని మాత్రం నోరు విప్పలేదు. మెగా ఫ్యాన్స్ లో చీలిక స్వయంగా కనిపిస్తున్నా ఫ్యాన్స్ ఎలా డిసైడ్ చేస్తారు అన్నది వేచి చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: