మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు కావాల్సిన హంగామా మొదలైంది. జనవరి 26న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తారని ఎనౌన్స్ చేశారు. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే కాదు సినిమాలో మహేష్ డైలాగ్ అదేనండి సిఎంగా మహేష్ ప్రమాణ స్వీకారం కూడా రిలీజ్ చేయబోతున్నారట. 


శ్రీమంతుడు తర్వాత సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కలయికలో వస్తున్న ఈ సినిమాకు భరత్ అను నేను టైటిల్ ప్రచారంలో ఉంది. కొరటాల శివ ఈ సినిమా చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సిఎంగా కనిపించనున్నాడు. ఇక సినిమా ప్రమోషన్స్ కూడా సిఎంగా మహేష్ ప్రమాణ స్వీకారం చేసే డైలాగ్ తోనే మొదలు పెడుతున్నారట.


ఈ విషయాన్ని డైరక్టర్ కొరటాల శివ ట్విట్టర్ లో ఎనౌన్స్ చేశారు. 26న ప్రమాణ స్వీకారం వినేందుకు అందరు సిద్ధంగా ఉండంటూ శివ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా మొత్తం ఆరోజు మహేష్ ప్రమాణ స్వీకారాన్ని ప్రసారం చేస్తాయట. రిపబ్లిక్ డే సెంటిమెంట్ తో ఓ సిఎం ఓథ్ ను సినిమా ప్రమోషనల్ గా వాడటం క్రేజీ థింగ్ అని చెప్పొచ్చు.


ఇక కొరటాల శివ ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ అలా ఇచ్చాడో లేదో ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ లో మహేష్ సినిమా వచ్చింది. భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఏప్రిల్ 27న రిలీజ్ అవనున్న ఈ సినిమా శ్రీమంతుడు మ్యాజిక్ రిపీట్ చేస్తుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: