పవన్ కళ్యాణ్ చేపట్టిన తన రాజకీయ జనచైతన్య యాత్ర ఈరోజుతో మూడవ రోజులో ప్రవేశించింది. ఇది ఇలా ఉండగా పవన్ ను టార్గెట్ చేస్తూ వివిధ వర్గాలకు అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అనేక మంది పవన్ ను టార్గెట్ చేస్తూ ఘాటైన  కామెంట్స్ తో పాటు సెటైర్లు వేస్తున్నారు. ఇది ఇలా ఉండగా సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ప్రిన్స్ మహేష్ బాబాయి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు పవన్ ను టార్గెట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసారు.

 మహేష్ మద్దతు ఎవరికి...వద్దని చెప్పొస్తా...

 

పవన్ కళ్యాణ్  చేసే కామెంట్స్ లో అర్థం ఉండదని చెపుతూ తోలుబొమ్మలాటలో కేతిగాడు మధ్యలో వచ్చినట్టుగా మధ్యమధ్యలో వచ్చి పవన్ ఏదో మాట్లాడి వెళ్ళిపోతాడని పవన్ కళ్యాణ్ రాజకీయ ఎత్తుగడలు కామెడీ ఎపిసోడ్ లా కనిపిస్తోంది అంటూ సెటైర్లు వేసారు ఆది శేషగిరి రావు.   అంతేకాదు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ‘జనసేన' తరుఫు పవన్ మాట్లాడతాడు అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు మహేష్ బాబాయ్.

 KRISHNA ALONG WITH MAHESH LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఇదే సందర్భంలో కొంతమంది మీడియా సంస్థ ప్రతినిధులు రాబోతున్న ఎన్నికలలో మహేష్ బాబు మద్దతు ఎవరికి ఉంటుందని అని అడిగిన ప్రశ్నకు సమాధాం ఇస్తూ వైసీపీకి "కృష్ణ – మహేష్ సేన" ఫ్యాన్స్ మద్దతివ్వడమంటే ఆ పార్టీకి మహేష్ బాబు మద్దతు ఇచ్చినట్టు కాదు అని చెపుతూ మహేష్  బాబు ఏ రాజకీయపార్టీలోకి వెళ్లకూడదు అన్నది తన అభిప్రాయం అని మహేష్ అందరికీ కావాల్సిన వ్యక్తి అంటూ కామెంట్స్ చేసాడు. ఇదే సందర్భంలో  కృష్ణసేన విషయమై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ సూపర్ స్టార్ కృష్ణ కంటి రక్తపు బిందువు నుంచి పుట్టిన సంస్థ "కృష్ణ సేన" అని చెపుతూ కృష్ణకు రక్షణగా మొదలైన "కృష్ణ సేన" టీడీపీకి వ్యతిరేకమే అంటూ ఘాటైన కామెంట్స్ చేసాడు.

 

వాస్తవానికి కృష్ణ సేనలో  లక్షలమంది సభ్యులు ఉన్నారు అన్న విషయాన్ని బయట పెడుతూ     మహేష్ ఎదిగే క్రమంలో ఈ సేన మద్దతు ఇస్తూ "కృష్ణ సేన – మహేష్ సేన" గా మారింది అని  చెపుతూ మహేష్ కు రాజకీయ ఉద్దేశాలు లేకున్నా మహేష్ అభిమానుల బలం పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు మహేష్  బాబాయ్. ఏ విషయం పై అయినా  నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే ఘట్టమనేని శేషగిరిరావు చేసిన   కామెంట్స్ వెనుక అర్ధాలు ఏమిటి అన్న కోణంలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి..  

 


మరింత సమాచారం తెలుసుకోండి: