తన సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా వరసపెట్టి సినిమాలు చేయడం నందమూరి సింహం బాలకృష్ణ వ్యవహార శైలి. దీనితో ఎవరో ఒక దర్శకుడు దొరికితే చాలు బాలకృష్ణ ఆసినిమా దర్శకుడి స్థాయిని పట్టించుకోకుండా సినిమాలు చేస్తూ ఉంటాడు. దీనితో బాలయ్య కెరియర్ లో గ్యాప్ రావడం అన్నవిషయం ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది.

 BALAKRISHNA IN JAISIMHA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

దీనికితోడు బాలకృష్ణ చేతిలో నాలుగు నెలలు ఉంటే చాలు ఏదోఒక సినిమాను కథ గురించి దర్శకుడు గురించి ఆలోచించకుండా నటించడం బాలయ్య వ్యవహార శైలి. ఈ తీరు వల్ల బాలకృష్ణ నటించిన సినిమా లేకుండా ఏ సంవత్సరం ఉండదు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రిలీజైన వెంటనే ‘పైసా’ వసూల్ ను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ఈమూవీ విడుదల కాకుండానే ‘జై సింహాను’ సెట్స్ పైకి తీసుకు వచ్చాడు.

 BALAKRISHNA IN JAISIMHA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఇలా గతసంవత్సరం అంతా బాలకృష్ణ చాల బిజీగా ఉన్నాడు. అయితే ఈ సంక్రాంతి రేసులో కూడ ఊహించని కనీస విజయం సాధించిన బాలకృష్ణకు సడెన్ గా గ్యాప్ రావడం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈ గ్యాప్ ఏకంగా ఏడు నెలలు ఉండటం మరింత షాకింగ్ గా మారింది.

 BALAKRISHNA IN JAISIMHA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఒక విధంగా చెప్పాలి అంటే బాలకృష్ణకు తెలియకుండానే ఈ గ్యాప్ వచ్చే పరిస్థుతులు ఏర్పడ్డాయి అని అంటున్నారు. తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ ను ఆగస్ట్ నుంచి సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు బాలయ్య. ఈ విషయాన్ని స్వయంగా బాలయ్యే లీక్ చేసాడు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర పై మరింత లోతైన రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉన్న నేపధ్యంలో ఇంత టైమ్ గ్యాప్ ను తీసుకుంటున్నాము అని అంటున్నాడు బాలయ్య. అయితే ఎన్టీఆర్ జీవితంలోని ఆఖరి ఘట్టంలోని వాస్తవాలు వివరించకుండా ఎంత రీసర్చ్ బాలకృష్ణ చేసినా ఈ బయోపిక్ కు న్యాయం జరుగుతుందా అన్నదే సందేహం.. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: