పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెపుతూ ప్రకటన చేసిన కొద్దిరోజులు గడవకుండానే పవన్ గెస్ట్ రోల్ ప్యాకేజ్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను షేక్ చేస్తున్నాయి. వాస్తవానికి పవన్ మైత్రీ మూవీస్ – ఎ.ఎమ్. రత్నం నిర్మాణ సంస్థలలో నటించడానికి ఒప్పుకుని ఇప్పటికే అడ్వాన్స్ లు తీసుకున్న విషయం తెలిసిందే.

 pawan kalyan latest photos in agnathavasi latest photos కోసం చిత్ర ఫలితం

అయితే పవన్ ఇప్పుడు తాను సినిమాలకు దూరం అని ప్రకటించడంతో ఈ అడ్వాన్స్ లు ఇచ్చిన నిర్మాణ సంస్థల పరిస్థితి ఏమిటి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో పవన్ గెస్ట్ రోల్ ప్యాకేజ్ కి సంబంధించిన వార్తలు ఊపు అందుకున్నాయి.

 pawan kalyan latest photos in agnathavasi latest photos కోసం చిత్ర ఫలితం

వాస్తవానికి ఈ నిర్మాణ సంస్థలు నిర్మించే సినిమాలలో పవన్ నటించే ఆస్కారం లేకపోయినా ఈ నిర్మాణ సంస్థలు భవిష్యత్ లో నిర్మించబోయే భారీ సినిమాలలో పవన్ గెస్ట్ పాత్రలో నటించే ఆస్కారం ఉంది అన్న వార్తలు ఊపందుకున్నాయి. దీనికితోడు పవన్ సినిమాలకు దూరం అయినా తన సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ ఆర్ట్స్ పై సంవత్సరానికి రెండు సినిమాలు నిర్మించే అభిప్రాయంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 pawan kalyan latest photos in agnathavasi latest photos కోసం చిత్ర ఫలితం

దీనితో పవన్ తాను నటించే సినిమాలకు దూరం అయినా తన నిర్మాణ సంస్థ కార్యకలాపాలతో అదేవిధంగా కొన్ని సెలెక్టివ్ సినిమాలలో అతిథి పాత్రలను ఎంచుకుని చేస్తూ ఫిలిం ఇండస్ట్రీలో తన పట్టును కొనసాగిస్తాడు అన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే వచ్చే ఏడాది రాబోతున్న ఎన్నికల హడావిడి పూర్తి కాకుండా పవన్ పూర్తి హీరోగా నటించే సినిమా మరి ఒకటి ఉండదు అన్న విషయం స్పష్టం అయిపోతోంది. ఏది ఎలా ఉన్నా టాలీవుడ్ ఎంపరర్ గా  తెలుగు ఫిలిం ఇండస్ట్రీని శాసించిన పవన్ వరస మూడు పరాజయాలతో తన కెరియర్ కి బ్రేక్ ఇవ్వడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: