మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న రంగస్థలం టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా టీజర్ అదిరిపోయింది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్తో వస్తున్న ఈ సినిమాలో చిట్టిబాబుగా చరణ్ లుక్స్ సూపర్ అని చెప్పాలి. టీజర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా మార్చి 30న రిలీజ్ కాబోతుంది.


సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తో ఇంప్రెస్ చేశారు చిత్రయూనిట్. సమంత ను రివీల్ చేయలేదు. సినిమాలో చరణ్ సౌండ్ ఇంజినీర్ అదేనండి చెవిటి వాడిగా నటిస్తున్నాడు. ఎదుటి వారి పెదాల కలయికను బట్టి వారు మాట్లాడింది కనిపెట్టేస్తాడు. నిజంగా ఓ స్టార్ హీరో రేంజ్ లో ఉన్న చరణ్ ఇలాంటి క్రేజీ అటెంప్ట్ తీయడం గొప్ప విషయం.


మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ తో అంచనాలు పెంచేయగా.. దేవి మ్యూజిక్ సినిమా టీజర్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. సుకుమార్, దేవి, చరణ్ ఈసారి కచ్చితంగా మ్యాజిక్ వర్క్ అవుట్ అయ్యేలా ఉంది. నాన్నకు ప్రేమతో తర్వాత సుకుమార్ చేస్తున్న ఈ సినిమా కమర్షియల్ హిట్ అవుతుందని ఏమాత్రం డౌట్ పడనవసరం లేదనిపిస్తుంది.


మాస్ మసాల ప్రియులకు నచ్చేలా సుకుమార్ చరణ్ ల రంగస్థలం ఉంది. ఇక మార్చి 30న చిట్టిబాబు రంగస్థలంలో చేసే అల్లరి ఎలా ఉంటుందో చూడాలి. సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్న చిత్రయూనిట్ టీజర్ తో మేం హిట్ కొట్టబోతున్నాం అని చెప్పకనే చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: