తెలుగు ఇండస్ట్రీలో మహానటులు నందమూరి తారక రామారావు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.  తెలుగు కళామతల్లికి రెండు కళ్లుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు అని ఎప్పటికీ చెబుతూనే ఉంటారు.  తెలుగు చలన చిత్ర సీమలో సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో కేవలం ఎన్టీఆర్ కోసమే ఆ పాత్రలు సృష్టించారా అన్న విధంగా ఆయన నటించిన ప్రతి పాత్రకు జీవం పోశారు.  అందుకే ఆయన శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా,రావణాసురుడిగా..జగదేక వీరుడిగా ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రల్లో ఎప్పటికీ మరువలేని విధంగా గుర్తుండిపోయారు. 
Related image
అయితే రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత కూడా కొన్ని అపురూపమైన చిత్రల్లో నటించారు ఎన్టీఆర్.  ప్రస్తుతం ఆయన వారసులు ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉన్నారు.  ఎన్టీఆర్ నట వారసుడిగా చిన్ననాడే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బాలకృష్ణ గత సంవత్సరం గౌతమి పుత్ర శాతకర్ణితో తన వంద చిత్రాలు పూర్తి చేసుకున్నారు.  గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీతానగరం విజయకీలాద్రిపై జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో బాలయ్య పాల్గొన్నారు.
Image result for ntr balakrishna
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తన తండ్రి దివంగత తారకరామారావు తీయలేకపోయిన సినిమాను తాను తీస్తానని  తెలిపారు. రామానుజాచార్య చిత్రాన్ని త్వరలోనే చేస్తానని చెప్పారు. "నేను ఎక్కువ ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతాను. ప్రతి పుస్తకం నుంచి ఎంతో కొంత సారాంశాన్ని గ్రహిస్తాను. రామానుజాచార్య జీవితం నన్ను ఎంతగానో ప్రభావితం చేసిందని అన్నారు. 
Image result for nandamuri heroes
రామానుజాచార్యులు గొప్ప ఆథ్యాత్మిక గురువే కాకుండా, గొప్ప సంఘ సంస్కర్త కూడా అని కొనియాడారు. వేల ఏళ్ల క్రితమే దళితులకు సమాజంలో సరైన గౌరవం కల్పించిన మహనీయుడు అని తెలిపారు. రామానుజాచార్యపై పోస్టల్ స్టాంప్ విడుదల చేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: