నేచురల్ స్టార్ నాని ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయిందన్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈరోజు ఉదయం షూటింగ్ కు వెళ్తున్న హీరో నాని కారుకు యాక్సిడెంట్ అవ్వడంతో.. సదరు హీరో గాయాలుపాలయ్యాడని తెలుస్తోంది.రాత్రంతా షూటింగ్ చేసుకుని ఇంటికి వస్తుండగా.. జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెం 45లో నాని ప్రయాణిస్తున్న కారు ఒక కరెంట్ పోల్ ను ఢీకొట్టింది. కారు ముందు భాగం నుజ్జవ్వడంతో పాటు.. నాని కి కూడా గాయాలయ్యాయని తెలుస్తోంది.

అయితే కారు డ్రైవర్ శ్రీనివాస్ నిద్రమత్తులో కారును నడపడం వలనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.  ప్రమాదం సమయంలో కారులో హీరో నాని తండ్రి రాంబాబు ఉన్నారు. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి 3/PPDA చట్టం కింద పోలీస్ కేసు నమోదు చేశారు. అయితే, కాస్త తక్కువ స్పీడ్ లో వెళ్తున్న కారణంగా, ప్రమాదం తప్పింది. కారు హడ్ లైట్స్ డ్యామేజ్ కాగా, నానికి స్వల్పగాయాలయ్యాయి.
Image result for hero nani
వెంటనే దగ్గర్లోని హాస్పటల్ లో ప్రాథమిక చికిత్స చేయించుకున్న నాని, తన ఇంటికి వెళ్లిపోయారు. అయితే నాని షూటింగ్స్ షెడ్యూల్స్ ఖరారైపోయిన కారణంగా, పోలీసు కేసు అయినా, మీడియాకు విషయం లీకైనా, మొత్తం షెడ్యూల్స్ డిస్టర్బ్ అవుతాయి. అదే జరిగితే నిర్మాతలకు భారీ నష్టాల్ని మిగలడం ఖాయం. అందుకే ఈ విషయం బయటికి పొక్కకుండా పోలీసులను ఒక నిర్మాత మ్యానేజ్ చేశారని సమాచారం.   నిజానికి సదరు కారు నెంబర్ టిఎస్ 07 ఎఫ్.సి. 0024 కావడంతో.. వెంటనే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయగా అది హీరో నాని తండ్రి గంటా రాంబాబు పేరు మీద ఉంది.   
Image result for hero nani
ప్రమాదం జరిగిన సమయంలో కారులో డ్రైవర్‌ మాత్రమే ఉన్నట్లు సమాచారం. అయితే ఆ ప్రాంతంలో ఎలాంటి సీసీ టీవీ కెమెరాలు లేకపోవడంతో ప్రమాద ఘటనపై స్పష్టత లేదు. కాగా ఓవర్‌ స్పీడ్‌ కారణంగా గత ఏడాది జూన్‌లో ట్రాఫిక్ పోలీసులు రూ.1400 చలానా విధించారు. అయితే ఆ చలానా ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: