తెలుగు ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగానే కాకుండా మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.  కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ మేళవించిన చిత్రాలు తెరకెక్కించడం..హీరో తో పంచ్ డైలాగ్స్ పలికించడం ఆయకు ఆయనే సాటి.  ఇప్పటి వరకు టాప్ హీరోలతో మాత్రమే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు ఉన్నాయన్న దానికి సమాధానంగా..ఆ మద్య నితిన్ తో అ..ఆ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు ఇండస్ట్రీలో త్రివిక్రమ్  - పవన్ కాంబినేషన్ అంటే బ్లాక్ బస్టర్ అనే అనుకుంటారు..గతంలో ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 
Related image
ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్ లో రీసెంట్ గా విడుదలైన ‘అజ్ఞాతవాసి’ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మొదటి నుంచి ఈ చిత్రంపై అభిమానులు విపరీతంగా అంచనాలు పెంచేసుకున్నారు. అయితే ఆ అంచనాలు అన్నీ తలకిందులు చేసి చిత్రం డిజాస్టర్ అయ్యింది.  అయితే అజ్ఞాతవాసి లో త్రివిక్రమ్ మార్క్ అస్సలు లేదని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.  ప్రస్తుతం త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కొంతకాలం క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
Image result for agnathavasi stills
త్వరలో ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకువెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'అజ్ఞాతవాసి'  సినిమాకి సంగీతాన్ని అందించిన అనిరుధ్, ఈ సినిమాకి కూడా సంగీతాన్ని సమకూర్చనున్నాడు.అజ్ఞాతవాసి వైఫల్యం ఇచ్చిన వైరాగ్యాన్ని పక్కన పెట్టారు. కొన్ని రోజుల నుంచి  ఇద్దరు సీరియస్ డిస్కషన్లు జరుపుతున్నారు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ నే. అందులో కూడా ఎలాంటి మార్పు లేదు.ఈ సినిమాలో కొత్తగా కనిపించడానికి ఎన్టీఆర్ గట్టి కసరత్తునే చేస్తున్నాడట. 
Image result for త్రివిక్రమ్ ఎన్టీఆర్
ఈ సినిమా కథానేపథ్యం ఏమిటనే ఆసక్తి ఎన్టీఆర్ అభిమానుల్లో నెలకొంది. దాదాపు యాక్షన్ ఎంటర్టైనర్ గానే ఉండవచ్చని అంతా భావించారు. కానీ .. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వుండనుందనేది తాజా సమాచారం. కుటుంబం .. బంధాలు .. అనుబంధాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. అందుకే ప్రతి సీన్, ప్రతి డైలాగ్ మళ్లీ కొత్తగా ప్రెజెంట్ చేసి, కొత్తగా రాసే పనిలో పడ్డారు. త్వరలోనే టైటిల్ ను ప్రకటించడమే కాకుండా, కథానాయిక ఎవరనే విషయంలోనూ స్పష్టతను ఇవ్వనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: