నాచురల్ స్టార్ నాని హీరోగా వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడని తెలిసిందే. రీసెంట్ గా ఎం.సి.ఏ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని ప్రస్తుతం కృష్ణార్జున యుద్ధం సినిమా షూటింగ్ లో ఉన్నాడు. అయితే ఈ సినిమా పూర్తి కాగానే మరో సినిమా లైన్ లో ఉంచాడు. ఇప్పటికే హను రాఘవపుడి సినిమా ఉంటుందని అనుకోగా అది క్యాన్సిల్ అయ్యింది.


అయితే కృష్ణార్జున యుద్ధం తర్వాత ఎన్నాళ్ల నుండో అనుకుంటున్న అవసరాల శ్రీనివాస్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడట నాని. ఈ సినిమా వారిద్దరి కెరియర్ లో క్రేజీ సినిమాగా ఉండేలా చూస్తున్నారట. నాని కెరియర్ లో గుర్తుండిపోయేలా కథ సిద్ధం చేస్తున్నాడట అవసరాల శ్రీనివాస్. జ్యో అచ్యుతానంద సినిమా తర్వాత అవసరాల డైరక్షన్ చేస్తున్న సినిమా ఇదే.


అవసరాల శ్రీనివాస్ ప్రస్తుతం నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. నాని నిర్మిస్తున్న అ! సినిమాలో కూడా ప్రత్యేక పాత్ర చేస్తున్నాడు అవసరాల శ్రీనివాస్. ఇక ఇప్పుడు అవసరాల డైరక్షన్ లో సినిమా షురూ చేస్తున్నాడు నాని. కృష్ణార్జున యుద్ధం సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు సంబందించిన పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.


మరి చెబుతున్నట్టుగా నానితో అవసరాల నిజంగానే గుర్తుండిపోయే సినిమా చేస్తాడా లేదా అన్నది చూడాలి. సినిమా తీస్తే గ్యారెంటీ హిట్ అన్న పంథా కొనసాగిస్తున్న నాని రాబోతున్న ఈ సినిమాలతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. ఇక ఇవే కాకుండా శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో నాగార్జునతో కలిసి నాని మల్టీస్టారర్ సినిమాలో కూడా నటించబోతున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: