నేడు భారత చిత్ర యవనికపై నువ్వనేనా అంటూ విజయవిహారం చేసే "స్టార్ క్వీన్ కథానాయికలు" 'ఇద్దరు గార్డెన్-సిటి గర్ల్సే'   (బంగళూర్ అమ్మయిలే). ప్రస్తుతానికి ఒకరు ఉత్తరాది చిత్రరంగాన్ని ఏలుతుంతే మరొకరు దక్షిణాదిన తనదైన ప్రతిభకు పట్టం కట్టారు.   గత కొంతకాలంగా ఇటు దక్షిణాదిలో అటు ఉత్తరాది పరిశ్రమలో మహిళా ప్రధాన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి.అగ్ర కథానాయకు ల చిత్రాలతో పోటీపడుతూ వసూళ్ల పరంగా దూసుకుపోతున్నాయి. 

Image result for deepika anushka bhagmati padmavat

తాజాగా టాలీవుడ్ లో అనుష్క షెట్టి కథానాయికగా నటించిన భాగమతి దక్షిణాదిదిని కుదిపేస్తుంటే,  బాలీవుడ్‌లో దీపికా పదుకునే కథానాయకిగా ఉత్తరాదిన ప్రకంపనలు కలిగిస్తుంది. వీరిరువురు టైటిల్‌రోల్స్ ని పోషించిన భాగమతి, పద్మావత్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీనే సృష్టిస్తున్నాయి.  ఇటీవలకాలంలో “లేడీ ఓరియెంటెడ్ లేదా విమెన్ సెంట్రిక్” సినిమాలు ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టడం ఇదే తొలిసారని భారతీయ సినీ ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి.  బాహుబలి-2 లో దేవసేన పాత్రను అద్భుతంగా పోషించిన అనుష్క షెట్టి ఆ తరవాత నటించిన భాగమతి చిత్రం నిర్మాణం నుంచే దేశ వ్యాప్త ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని నెలకొల్పింది. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ హక్కులకోసం కొన్ని నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నట్లు తెలుస్తుంది. కొందరైతే హింధీలోకి డబ్ చేయమని నిర్మాత దర్శకులపై వత్తిడి తెస్తున్నారని తెలుస్తుంది.  

Image result for deepika anushka bhagmati padmavat

ఇక “పద్మావత్” వరుస వివాదాలతో తన ప్రాచుర్యాన్నినిర్మాణ దశనుండే పెంచుకుంది. ప్రస్తుతంఈ రెండు చిత్రాలు ఆయా పరిశ్రమల బాక్సాఫీస్ వద్ద సంచలనాల్ని సృష్టిస్తున్నాయి. ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలాభన్సాలీ దర్శకత్వం లో దీపికాపదుకునే, రణవీర్‌సింగ్, షాహిద్‌కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన “పద్మావత్” నిర్మాణం నుండే వివాదాలతో సహ జీవనం చేసింది. ఈ నెల 25న ప్రదర్శనలకు థియేటర్స్ లో కొచ్చి, ప్రస్తుతం రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్నది. తొలి వారాంతంలో 114కోట్ల వసూళ్లను సాధించి బాలీవుడ్ ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యపరచింది.

Related image

రాజ్పూత్ కర్ణిసేన వల్ల దేశ వ్యాప్తంగా శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొని కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు ఈ చిత్ర ప్రదర్శనకు అభ్యంతరం తెలిపాయి. అయితే సుప్రీంకోర్టు ఆదేశంతో పోలీస్ భద్రత నడుమ పద్మావత్‌ను ప్రదర్శించారు. కొన్నివర్గాల నుంచి వచ్చిన తీవ్రవ్యతిరేకత దృష్ట్యా సినిమా కలెక్షన్లపై దర్శకనిర్మాతలు తొలుత భయాం దోళ నలు వ్యక్తం చేశారు. వాటిని పటాపంచలు చేస్తూ విడుదలైన ఐదురోజుల్లోనే 100కోట్ల కలెక్షన్ల మైలురాయిని దాటి సంచలనం సృష్టించింది. బాలీవుడ్ చలనచిత్ర చరిత్రలో మహిళా ప్రధాన చిత్రానికి తొలి వారాంతంలో ఈ స్థాయివసూళ్ళు రావడం ఇదే తొలిసారని చెబుతు న్నారు.

Image result for deepika anushka bhagmati padmavat aishwarya jodha

బ్యూటీ క్వీన్స్ ఆఫ్ గార్డెన్ సిటీ 


బాహుబలి-2 చిత్రంలో దేవసేనగా ఆసేతు శీతాచలం - అపూర్వ అశేష భారతీయ ప్రేక్షకుల మన్ననలు సొంతం చేసుకుంది అనుష్క షెట్టి. ఆమె తదుపరి సినిమా కోసం ప్రేక్షకులు రెండేళ్ళుగా ఆసక్తిగా ఎదురుచూశారు అంటేనే ఆమె నటనపై ప్రేక్షకు ల ఆరాధన ఏ స్థాయిలో ఉందో చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అనుష్క నటించిన “హారర్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా” భాగమతి చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వం వహించారు. టీజర్, ట్రైలర్స్‌లోనే ప్రేక్షకుల్లో అమితా సక్తిని రేకెత్తించిన ఈ చిత్రం ఈ నెల 26న తెలుగు, తమిళ, మలయాళ భాష ల్లో త్రిభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందు కొచ్చింది. ఒక్క తెలుగులోనే తొలి మూడురోజుల్లో 30కోట్లకు పైగా గ్రాస్-కలక్షన్లు సాధించి వసూళ్ల చరిత్రలోనే సరికొత్త ఒరవడి ని సృష్టిస్తూ, సరికొత్త రికార్డ్ ను నెలకొల్పింది.  ఇందులో ఒక్క నైజాంలోనే ₹ 10కోట్ల వసూళ్లు రావడం విశేషం. మరికొన్ని రోజు ల్లో భాగమతి సునాయసంగా యాభైకోట్ల వసూళ్ల మైలురాయిని దాటుతుందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Image result for deepika anushka bhagmati padmavat
మహిళా ప్రధాన చిత్రం తొలి మూడురోజుల్లో ₹30 కోట్లు సాధించడం తెలుగు పరిశ్రమలో నూతనాధ్యాయానికి నాంది అని చెబు తున్నారు. మహిళా ప్రధాన చిత్రాల్లో తొలిసారి గా₹ 50కోట్ల క్లబ్‌లో (శాటిలైట్ హక్కులతో కలిపి) చేరబోతున్న తెలుగు చిత్రంగా భాగమతి అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతుందని అంటున్నారు. మొత్తంమీద గత వారంరోజుల్లో ప్రేక్షకులు ముందు కొచ్చిన ఫిమేల్ సెంట్రిక్ లేదా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలైన “భాగమతి-పద్మావత్” తమతమ  బాక్సాఫీస్‌ వసూళ్ళకు సరికొత్త నిర్వచనాన్ని చెబుతూ వసూళ్ల వరద దాటి సునామీని సృష్టిస్తున్నాయి.

Image result for deepika anushka bhagmati padmavat

మరింత సమాచారం తెలుసుకోండి: