త‌న‌కి ముద్దు ఇచ్చే వ‌ర‌కూ అది నిజ‌మో కాదో ఆమెకు తెలియ‌దంట. ఇదంతా హృతిక్ రోష‌న్‌,ప్రియాంక చోప్ర మూవీలో చోటుచేసుకుంది. ఈ దీపావ‌ళికి గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న క్రిష్‌3 మూవీలో ఈ లిప్‌లాక్ సీన్ క్రియోష‌న్ అనేది చాలా ఫ‌న్నీగా జ‌రిగిందంటూ రాకేష్ రోష‌న్ మీడియాకు చెప్పాడు. క్రిష్ 3 ప్రమోష‌న్‌లో భాగంగా కొడుకు హృతిక్‌రోష‌న్ గురించి పొగుడుతూ ఈ మూవీకు సంబంధించిన కొన్ని సీన్లను, వాటి వెన‌క ఉన్న శ్రమ‌ను గుర్తుకుచేసుకున్నాడు.

మొద‌ట ఈ స్టోరి ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రియాంక‌చోప్రతో లిప్‌లాక్ అనేది ఉంద‌కూడ‌ద‌ని అనుకున్నారంట‌.కంప్లీట్ మూవీ అయిపోయిన త‌రువాత ఇందులో ప్రియాంక‌చోప్రకు ఒక స‌న్నివేశంలో ముద్దు ఇవ్వాల్సి ఉండ‌గా డైరెక్టర్ నో అన్నాడంట‌. కాని మూవీ చూసేటప్పుడు ప్రేక్షకులు ఆ సీన్‌లో హీరోహీరోయిన్స్ మ‌ధ్య ముద్దును ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అలా ఉంటేనే ఆ సీన్ పండిద్దని అంద‌రూ అనుకోవ‌డంతో, ఇదే విష‌యాన్ని ప్రియాంక చోప్రకి చెబితే వెంట‌నే ఓకె చెప్పేసింద‌ట‌. ఆ త‌రువాత రోజే హృతిక్‌రోష‌న్‌,ప్రియాంక చోప్రల మ‌ధ్య హాట్ లిప్‌లాక్ సీన్‌ను షూట్ చేయించారు. మూవీలో ఈ లిప్‌లాక్ వండ‌ర్‌ఫుల్‌గా ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తార‌ని బిటౌన్ అంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి: