ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన "బాహుబలి 1 & 2" సినిమాల్లో దేవసేన పాత్ర పోషించిన తర్వాత అందాల తార అనుష్క శెట్టి నటించిన ‘భాగమతి’ జనవరి 26న విడుదలై ప్రేక్షకాదరణ పొందుతుంది.  అనుష్క నటన, అశోక్ దర్శకత్వం, మథి కెమెరా వర్క్, తమన్ సంగీతం - రీ రికార్డింగ్, అబ్బుర పరిచే రవీందర్ ఆర్ట్ వర్క్‌ మాత్రమే కాక అత్యున్నత సాంకేతిక విలువలతో జతచేర్చి నిర్మించిన 'భాగమతి' చిత్రానికి కనక వర్షం కురిపిస్తోంది. 


బహుభాషా చిత్రంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడభాషల్లో విడుదలై సంచలన విజయాన్ని ఇప్పటికే నమోదుచేసిన సందర్భంగా నిన్న మంగళవారం ఈ మూవీ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించింది ఈ చిత్ర యూనిట్. ఈ సందర్భం గా ‘భాగమతి’ చిత్రాన్ని ఉద్దేశించి అనుష్క చేసిన భావోద్వేగ ప్రసంగం పలువురిని ఆకట్టుకుంది. ఆమె మాటల్లో ప్రభవిల్లిన మానెజీరియల్ మెస్మరిజం ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసింది. స్వీటీ భుజస్కందాలపై నిలబడి విజయం సాధించిన ఆ సినిమా విజయాల విలువల్ని తన టీం సక్సెస్ గా చెప్పటంలో ఆమె ఎంతగా ఎదిగిపోయిందో తెలుపుతుంది. 

Anushka

అనుష్క మాట్లాడుతూ "భాగమతి" చిత్రం నటిగా తనను మరో మెట్టు ఎక్కించిందన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన ఈ మూవీ తొలి ఆట నుంచి పాజిటివ్‌ టాక్‌తో రన్ అవుతోంది. ఈ చిత్రం చూసినవారందరూ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు బాగా చేస్తున్నానని అభినందిస్తున్నారు.‘భాగమతి’ చిత్రానికి ఇంత పేరు రావడానికి కారణం ఆర్టిస్టులు, టెక్నిషియన్లే అన్నారు. ఓ మంచి బ్యానర్, ఆ బ్యానర్‌కు తగ్గ టీం కుదిరినప్పుడే సక్సెస్ లభిస్తుందని, భాగమతిచిత్రంతో ఇదిమరోసారి రుజువైందన్నారు అనుష్క. అనుష్క మాటల్లో అరుంధతి, రుద్రమదేవి కోసం ఎలా కష్టపడిందో అదే తపన, అంకితభావం ఈ సినిమాలో తన నటనలో కనిపించాయి.


తెలుగుతో పాటు తమిళ,మలయాళ భాషల్లో ఈ సినిమా మ్యాజిక్‌ను చేస్తున్నదని, కొత్త కథల్ని తెలుగు ప్రేక్షకులు ఎల్లవేళలా ఆదరిస్తారని ఈ సినిమా మరోసారి ఋజువు చేసింది. సినిమాకు రోజురోజుకు ఆదరణపెరుగుతున్నదని, పాజిటివ్-టాక్‌తో సినిమా దూసుకుపోతున్నదని తెలిపింది. 


నేడు యు.వి క్రియేషన్స్ వంశీ, ప్రమోద్‌ లలో నన్ను నేను చూసుకుంటు న్నానంటూ, చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆరేళ్ల లో ఐదు హిట్స్ కొట్టారని తన మాదిరి గానే వారు ఐదు విజయాల్ని అందు కున్నారు. తను తెలుగుకే పరిమితమైతే వారు మాత్రం తమిళ, మలయాళ భాషల్లో తమ ముద్రను చాటుకున్నారు. వారి బాట లోనే అడుగులు వేయాలని అనిపిస్తుంది అని వారిని భావోద్వేగంగా ప్రోత్సహించారు. 


దర్శకుడు అశోక్ మాట్లాడుతూ 2012లో ఈ ప్రయాణం ప్రారంభమైంది. అప్పుడు తీసుకున్ననిర్ణయానికి టీమ్ అంతా కట్టుబడి ఎంతో నమ్మకంతో ఈ సినిమా చేశాం. మానమ్మకం నిజమవ్వడం ఆనందంగా ఉంది. నేను చెప్పిన కథను నమ్మి అనుష్క ఈ సినిమా చేసింది. 


భిన్న విభిన్న పార్శాలున్న పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఈ సక్సెస్ క్రెడిట్ అనుష్కతో పాటు నిర్మాతలదే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో వంశీ, ప్రమోద్, విక్రమ్, తమన్ తదితరులు పాల్గొన్నారు. ఈమీట్‌ కు ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో పాటు దర్శకుడు జి. అశోక్, సంగీత దర్శకుడు తమన్, చిత్రనిర్మాతలతోపాటు ఈమూవీలో నటించిన ఇతర నటీ నటు లు హాజరయ్యారు.

Image result for bhaagamathie success meet photos

మరింత సమాచారం తెలుసుకోండి: