అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ లావణ్య త్రిపాఠి. ఇన్నాళ్లు హోమ్లీ లుక్ లో అలరించిన ఈ అమ్మడు ఇలా అయితే ఇక కష్టమే అనుకుంది కాబోలు ప్రస్తుతం చేస్తున్న ఇంటిలిజెంట్ మూవీలో అందాలకు పని పెట్టేసింది. వినాయక్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సాయి ధరం తేజ్ హీరోగా నటించాడు.


వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో లావణ్య చురుగ్గా పాల్గొంటుంది. అంతేకాదు సాంగ్స్ లో ప్రమోషనల్ వీడియోస్ లో లావణ్య ఈ సినిమాలో గ్లామర్ డోస్ పెంచిందని తెలుస్తుంది. ఈ సినిమా ఫలితం తన కెరియర్ కు చాలా ప్రాముఖ్యమని గుర్తించిన లావణ్య త్రిపాఠి ఇంటిలిజెంట్ లో మరింత రెచ్చిపోయిందని తెలుస్తుంది.  


సాంగ్స్ లోనే ఈ రేంజ్ లో రెచ్చిపోయింది అంటే కచ్చితంగా సినిమాలో ఆమె ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తుందని అంటున్నారు. ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు లావణ్య త్రిపాఠి కూడా అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు. సినిమా అంచనాలను అందుకుని హిట్ అయితే అమ్మడి కెరియర్ కు కాస్త హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. 


తనతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ స్టార్స్ తో కలిసి పనిచేస్తుండగా అమ్మడు ఇంకా కుర్ర హీరోలకే పరిమితం అయ్యింది. అవకాశాలు కూడా అంతగా రావట్లేదు అందుకే లావణ్య ఇక స్కిన్ షోకి సిద్ధమైంది. మరి అమ్మడు అందాల ప్రదర్శన ఎంతవరకు సినిమాకు హెల్ప్ అవుతుందో చూడాలి. ఈ సినిమా హిట్ అయితే లావణ్య కెరియర్ కు బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: