మెగా పవర్ స్టార్ రాం చరణ్, ఉపాసనల జంట గురించి అందరికి తెలిసిందే. ఈమధ్య ఫ్యాన్స్ తో మమేకమై తమ ఫీలింగ్స్ ను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్న ఈ జంట చాలా సర్ ప్రైజులే ఇస్తున్నారు. రీసెంట్ గా రంగస్థలంలోని తన పాత్రతో ఉప్స్ గారండి చిట్టి బాబుకి ఆకలేస్తుంది అంటూ ఫన్నీ వీడియో పెట్టిన చరణ్ ఇప్పుడు భాగమతి సినిమాను పొగుడుతూ ఉపాసన నైట్ అంతా నిద్రపోకుండా చేసినందుకు థ్యాంక్స్ అన్నాడు.


భాగమతి సినిమా చూసిన చరణ్ అండ్ ఉపాసనలు సినిమాను పొగడ్తలతో ముంచెత్తారు. రాం చరణ్ మాత్రం సినిమా నిజంగా బాగుంది. టీం అంతా చాలా కష్టపడ్డారు అందరికి శుభాకాంక్షలు. అనుష్క నటన మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకొచ్చాడు. ఇక తన భార్యకు నైట్ జాగారం చేయించిన సినిమా భాగమతి అందుకు థ్యాంక్స్ అంటూ చమత్కరించాడు చరణ్. 


Happened to watch #Bhagmathie last night. Mind blowing performance by Anushka. Great technical and production values. A...

Posted by Ram Charan on Thursday, 1 February 2018
సినిమా హిట్ అవడం ఓ లెక్క అయితే సినిమా వాళ్లను కూడా సినిమా గురించి మాట్లాడేలా చేయడం అది అనుష్క భాగమతి వల్లే అయ్యింది. పిల్ల జమిందార్ అశోక్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కించారు. తమన్ మ్యూజిక్ కూడా సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది.


మొత్తానికి అనుకున్న దానికన్నా అనుష్క నటించిన భాగమతి సూపర్ సక్సెస్ అయ్యింది. చరణ్ చూసి తన మాటలతో సినిమాను పొగిడాడు ఇలా సినిమా చూసిన సిని సెలబ్రిటీస్ కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భాగమతి సినిమాపై రాం చరణ్ రెస్పాన్స్ కు నెటిజెన్లు కూడా సరదా రెస్పాన్స్ ఇస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: