ఈ మద్య సినిమాలు రిలీజ్ కి ముందు ఆ సినిమా షూటింగ్ విశేషాలతో కూడిన వీడియోలు ప్రమోషన్ చేస్తున్నారు.  ముఖ్యంగా టాప్ హీరోలు షూటింగ్ లో ఎలా గడిపారు..వారు మేకప్ కష్టాలు ఎలా ఉన్నయోగా అన్న విషయం పై వీడియోలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. గతంలో అనుష్క బాహబలి కోసం మేకప్ చేయించుకుంటున్న వీడియో ఓ రేంజ్ లో సక్సెస్ అయ్యింది.  ఆ తర్వాత రోబో 2.0 కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ మేకప్ వీడియో కూడా మంచి ఆదరణ లభించింది.

తాజాగా విలక్షణ నటులు మంచు మోహన్ బాబు ‘గాయత్రి’ చిత్రం కోసం మేకప్ వేయించుకునే ఓ విడియో రిలీజ్ చేశారు. 
ఈ నెల 9 న గాయత్రి చిత్రం రిలీజ్ సందర్భంగా చిత్ర విశేషాలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. గాయత్రి’ థియేట్రికల్ ట్రైలర్‌ను చూసిన చాలా మంది మోహన్‌బాబు గురించే మాట్లాడుకున్నారు. మళ్లీ పాత డైలాగ్ కింగ్‌ను చూశామని ఫ్యాన్స్ సంబరపడ్డారు. రెండు ఛాయలున్న పాత్రలో ఆయన కనిపించనున్నట్లు ట్రైలర్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.

మోహన్‌బాబు చాలా కాలం తరవాత పవర్‌ఫుల్ పాత్రలో నటించించారు.. ‘రోబో’లో రజనీకాంత్, ‘దశావతారం’లో కమల్ హాసన్ ఇలాంటి మేకప్ వేసుకుని పాత్రల్లో తేడాలను చూపించగలిగారు. ప్రొథెస్టిక్ మేకప్‌కు మూడు గంటలకు పైగా సమయం పడుతుంది. అంతసేపు సీటులో కూర్చొని మేకప్ వేసుకోవడంతో కత్తి మీద సామే. ఇంత కష్టమైన మేకప్‌ను మోహన్‌బాబు చాలా ఓపిగ్గా వేయించుకున్నారంటే సినిమాపై ఆయనకున్న నిబద్ధత ఏంటో తెలుస్తోంది.  తన పాత్రలో వేరియేషన్స్ చూపించడానికి ఎంతో కష్టపడి మేకప్ వేసుకున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: