ఈ మద్య కొంత మంది హీరోయిన్లు ప్రేమ వివాహాలు చేసుకొని కొంత కాలానికే అనివార్య కారణాల వల్ల విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే.  రీసెంట్ గా సినీ వర్గాల్లోనే కాక అంతటా హాట్ టాపిక్ గా మారిన అంశం..అమలా పాల్ విడాకులు. ఇక  మళయాళి నటి, డాన్సర్ అయిన దివ్య ఉన్ని తన భర్త డాక్టర్ సుధీర్ సుధాకరన్ నుంచి విడిపోయింది. అయితే  విడాకులు పొందుతున్న సినీ ప్రముఖుల జాబితా నానాటికీ పెరిగిపోతోంది. ఇందులోభాగంగా, తాజాగా మరో నటి విడాకులు పొందింది.
డాన్స్ పై మక్కువతో
దాదాపు 14 సంవత్సరాల వైవాహిక జీవితానంతరం విడిపోవటంతో ఇప్పుడు మళయాళి సిని పరిశ్రమలో ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది. విడిపోవటానికి కారణం...భర్త సుధీర్ అక్రమ సంభంధమే అంటూ మీడియాలో వార్తలు సైతం వచ్చాయి.  అంతే కాదు దివ్య ఉన్నికి డాన్స్ పై ఉన్న ఆసక్తి,డాన్స్ స్కూల్ పెట్టడం భర్తకి నచ్చలేదట. ఇక విడాకులు ఇచ్చిన తర్వాత  తనకు తగ్గ కథ లభిస్తే నటిస్తానంటున్న ఈ మలయాళీ భామ చెల్లెలు విద్యాఉన్నికి కూడా నటనపై మోజు పెరిగిందట.
కుదరదు
ఆమెను హీరోయిన్‌ను చేసే పనిలో ఉన్నారు దివ్యాఉన్ని. పనిలో పనిగా తన చెల్లెలితో కలిసి నటించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. అలాంటి మంచి కథ కుదిరితే ఇద్దరం కలిసి నటించడానికి రెఢీ అంటున్నారు.  ఇదిలా ఉంటే..నటి దివ్య ఉన్ని రెండో పెళ్లి చేసుకున్నారు.అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అరుణ్‌ కుమార్‌ మణికందన్‌ను ఆమె వివాహం చేసుకున్నారు.
సినిమాల్లోకి
హ్యూస్టన్‌లోని గురువయప్పన్‌ ఆలయంలో ఈ శుభకార్యం జరిగింది. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు.  తమకు శుభాకాంక్షలు చెప్పిన వారికి ధన్యవాదాలు తెలిపారు. పెళ్లిలో దిగిన ఫొటోను పంచుకున్నారు. ఈ సందర్భంగా తీసిన మరికొన్ని ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఏడే ఏట నుంచే
తెలుగులో ఆమె ‘ఇల్లాలు ప్రియురాలు’ అనే సినిమాలో నటించారు. ఇందులో వేణు, జయసుధ, ప్రకాశ్‌రాజ్‌, భానుప్రకాశ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. నటిగానే కాదు నృత్యకారిణిగా కూడా దివ్యకు మంచి గుర్తింపు ఉంది.

అనేక అంతర్జాతీయ, జాతీయ షోలలో ఆమె పాల్గొన్నారు.14 ఏళ్ల వయసుకే చిత్ర పరిశ్రమకు పరిచయమైన దివ్య దక్షిణాదిలోని వివిధ భాషల్లో 50 సినిమాలకుపైగా నటించారు. మలయాళంలో మోహన్‌లాల్‌, మమ్ముట్టి, దిలీప్‌ వంటి స్టార్స్‌ సరసన నటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: