బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ ఈ మద్య ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్ చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  అంతే కాదు కొంత కాలంగా ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తున్నారు.  ఈ శుక్రవారం ‘ప్యాడ్‌మన్‌’తో థియేటర్లలో అడుగుపెట్టనున్న అక్షయ్ వచ్చే స్వాతంత్ర దినోత్సవానికి తన తదుపరి చిత్రాన్ని లైన్‌లో పెట్టాడు.  క్రీడా నేపథ్యంలో రూపొందిన ‘గోల్డ్‌’.. 1946 ఒలింపిక్స్‌ లో భారత దేశానికి హాకీలో గోల్డ్‌ మెడల్‌ అందించిన హాకీ జట్టు కోచ్‌ జీవిత కథ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కింది. 

అతి తక్కువ ధరకు లభ్యమయ్యే శానిటరీ నేప్‌కిన్‌లను తయారు చేసి, తన గ్రామంలో ఉన్న మహిళలకు అందజేసిన అరుణాచలమ్‌ మురుగనాథమ్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ప్యాడ్ మాన్ మూవీ తెర‌కెక్కించారు. ఫిబ్రవ‌రి 9న విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్స్ చేస్తున్నాడు అక్ష‌య్.  ఇక ‘గోల్డ్’ చిత్రం విషయానికి వస్తే..1946 ఒలింపిక్స్‌ లో భారత దేశానికి హాకీలో గోల్డ్‌ మెడల్‌ అందించిన హాకీ జట్టు కోచ్‌ జీవిత కథ నేపథ్యంగా  తెరకెక్కుతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. 

భార‌త హాకీ జ‌ట్టు ఇండిపెండెంట్‌గా ఒలంపిక్స్‌లో పాల్గొని స్వ‌ర్ణ‌ప‌త‌కం సాధించ‌డం వెనుక కోచ్ అందించిన స్పూర్తి, ఆయ‌న ప‌డ్డ త‌ప‌న‌, ఆట‌గాళ్ళ సంఘ‌ర్ష‌ణ వీటి ఇతివృత్తంగా సినిమా తెర‌కెక్కిన‌ట్టు టీజ‌ర్‌ని బ‌ట్టి తెలుస్తుంది. సాతంత్ర్య దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌తో ఆగ‌స్ట్ 15న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రోవైపు కేసరి అనే చారిత్రాత్మక చిత్రంతో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అక్షయ్. 

బ్రిటీష్ ఇండియన్ బృందాలకు, ఆఫ్ఘనిస్థాన్ బృందాలకు మధ్య జరిగిన సరాగర్హి యుద్ధం నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందట. అనురాగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ సిక్కుగా కనిపించనున్నాడని ఇటీవ‌ల విడుద‌లైన‌ పోస్టర్ ద్వారా తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: