చిరంజీవి వారసుడుగా మెగా పవర్ స్టార్ గా ఇప్పటికే లక్షలాది మంది అభిమానులను పొందిన రామ్ చరణ్ తన లేటెస్ట్ మూవీ క్రేజ్ పెంచుకోవడం కోసం ఆ నలుగురుని ఆధారంగా తీసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు బోయపాటి రామ్ చరణ్ ల కాంబినేషన్ లో త్వరలో ప్రారంభం కాబోతున్న మూవీ కోసం దర్శకుడు బోయపాటి భారీ తారాగణాన్ని ఎంపిక చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 ఉత్కంఠ రేపుతున్న వివేక్ రోల్
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విలన్ గా వివేక్ ఒబెరాయ్ రంగంలోకి దిగుతున్న నేపధ్యంలో మరొక కీలక పాత్రకు ఒకనాటి అందాల హీరోయిన్ స్నేహ ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడుగా చరణ్ సోదరులుగా ఒకప్పటి తమిళ హీరో ప్రశాంత్ యంగ్ హీరో నవీన్ చంద్ర ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కథ అంతా ఈ నలుగురు చుట్టూ తిరగడమే కాకుండా చరణ్ పాత్రను హైలెట్ చేసే విధంగా ఈ నాలుగు పాత్రలను దర్శకుడు బోయపాటి డిజైన్ చేసినట్లు టాక్. 
SNEHA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇప్పటికే బోయపాటి తన రొటీన్ స్టైల్ కు భిన్నంగా ఈమూవీలో కామెడీ పార్ట్ ను కూడ బాగా పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాబోతున్న మండే ఎండలను లెక్క చేయకుండా ఏప్రియల్ నెల అంతా రాజస్థాన్ లోని ఎడారి ప్రాంతాలలో ఈసినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారు అని తెలుస్తోంది. 

ఈ వార్తలను బట్టి బోయపాటి చరణ్ ను ఈసినిమాలో ఒక భారీ కుటుంబం మధ్య మెలిగే యంగ్ హీరోగా చూపెట్టబోతున్నాడు అనుకోవాలి. దీనికితోడు ఈ సినిమాను బోయపాటి తన రొటీన్ స్టైల్ కు భిన్నంగా అత్యంత వేగంగా 4 నెలలలో పూర్తి చేయబోతున్నాడు అన్న వార్తలు కూడ వస్తున్నాయి. చరణ్ కోసం ఇద్దరు సోదరులు ఒక వదిన ఏమిచేయబోతున్నారు అని తెలియాలి అంటే ఈమూవీ విడుదలయ్యే దసరా సీజన్ వరకు ఆగాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: