ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ట్విట్టర్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హైజాక్ చేశారు. అంతే కాదు ఖాతాను హ్యాక్ చేసిన వారు టర్కీకి చెందిన వారిగా, తమను టర్కిష్ సైబర్ ఆర్మీగా ప్రకటించుకున్నారు. అనుపమ్ ఖేర్ ఖాతాను హ్యాక్ చేసిన ఈ సైబర్ ముఠా వింత సందేశాలను పోస్ట్ చేసింది.  ‘మీ అకౌంట్ ను టర్కిష్ సైబర్ ఆర్మీ అయిలిడ్జ్ టీమ్ హ్యాక్ చేసింది. మీకు సంబంధించిన కీలక డేటాను సొంతం చేసుకున్నాం’, ‘ఐ లవ్ పాకిస్థాన్’ అని ట్విట్లు పెట్టేసింది.  దీనిపై అనుపమ్ ఖేర్ స్పందించారు.
anupam kher twitter account hacked
‘‘నా ట్విట్టర్ ఖాతా ఇప్పుడే హ్యాక్ అయింది. భారత్ లోని నా స్నేహితుల నుంచి ఇదే విషయమై కాల్స్ వచ్చాయి. నేను లాస్ ఏంజెలెస్ లో ఉన్నాను. ఇక్కడి సమయం అర్ధరాత్రి ఒంటిగంట. దీని గురించి ట్విట్టర్ తో ఇప్పటికే మాట్లాడాను’’ అని అనుపమ్ ఖేర్ ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు.  గతంలో పలువురు సెలబ్రెటీల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ చేసిన హ్యాకర్లు ఇష్టానుసారంగా మెసేజ్ లు పోస్ట్ చేసి హల్ చల్ చేశారు.
Image result for అనుప‌మ్ ఖేర్ ట్విట్ట‌ర్
ఇప్పుడు బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసి ఆ విధంగా మెసేజ్ లు పోస్ట్ చేయడంతో మరిన్ని ఇబ్బందులు వచ్చేలా ఉందని భావించారు. ఈ నేపథ్యంలో అనుపమ్ ఖేర్ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ చేసిన ట్విట్టర్ యాజమాన్యం.. ఆతరువాత మళ్లీ రిలీజ్ చేసింది.  ట్విస్ట్ ఏంటంటే..స్నేహితులు ఫోన్ చేసి చెప్తేగానీ హ్యాక్ అయిందన్న విషయం ఖేర్ కు కూడా తెలియదు.


మరింత సమాచారం తెలుసుకోండి: