అందానికి అభినయానికి తొమ్మిదవ డశకంలో వెండివెన్నెల యవనికపై తనదైన ముద్రవేశారు కథానాయకి మాధురీ దిక్షిత్. తన నటన సౌందర్యంతో నయగారం వయ్యారం నృత్యాలతో మొత్తం యువ భారతాన్ని ఒకటిన్నర దశాబ్ధం ఉర్రూతలూపిన హీరోయిన్ మాధురీ దీక్షిత్. అప్పట్లో ఆమె దేశం మొత్తంలో నంబర్ వన్ హీరోయిన్, కలల నాయకి. సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు, సెలబ్రెటీ ల్లోనూ ఆమెకు వీరాభిమానులు చాలా మందే ఉన్నారు. నేను "మాధురీ ఫ్యాన్" అని రణబీర్ కపూర్, ఐశ్వర్యారాయ్, కరిష్మా కపూర్, కత్రినా కైఫ్, మనీషా కొయిరాలా లాంటి సినీ తారలు ఎన్నోసార్లు చెప్పుకున్నారు. 

Image result for madhuri hot dance

ఈ జాబితాలో ప్రపంచ ప్రఖ్యాత "లెజెండరీ బ్యాడ్మింటన్ ప్లేయర్" మరో ప్రఖ్యాత నటి, అందల రాశి దీపికా పదుకొనే తండ్రి, ప్రకాశ్ పదుకొనే కూడా ఉన్నారట. ఎప్పుడూ మీడియా ముందు పెద్దగా మాట్లాడని ప్రకాశ్ పదుకునే గురించి ఒక సీక్రెట్ ఆయన ముద్దుల తనయ దీపికా పదుకునే ఒక కార్యక్రమంలో వెల్లడించింది. మాధురీ దీక్షిత్‌ కు తన తండ్రి వీరాభిమాని అని, మాధురికి పెళ్లి అయినపుడు ఆయన చాలా బాధపడ్డారని దీపిక తెలిపింది. ఆ బాధ ఏ స్థాయిలోనిదంటే, మాధురి పెళ్లి గురించి మీడియా లో వార్త చూడగానే ఆయన బాత్రూం లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నాడట. కాసేపటి తర్వాత ఆయన బయటికి రాగా, కళ్లు వాచిపోయి ఉన్నాయని, దాన్ని బట్టే ఆయన లోలోపల ఎంతగా బాధ పడి, ఏడ్చారో? అర్థమైందని దీపిక వెల్లడించింది. 

సంబంధిత చిత్రం

ఇప్పటికీ ఆ సంఘటన గుర్తు చేసుకుని తమ ఫ్యామిలీ మెంబర్స్ అందరం నవ్వుకుంటూ ఉంటామని, మాధురికి తన తండ్రి అంతటి వీరాభిమాని అని దీపిక వెల్లడించింది. ఒక కార్య క్రమంలో మాధురి దిక్షిత్ సమక్షంలోనే దీపిక వెల్లడించడం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: