మెగా హీరో వ‌రుణ్‌తేజ్ లేటెస్ట్ సినిమా తొలిప్రేమ‌. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ అయిన‌ప్ప‌టి నుంచి సినిమా వ‌ర్గాల్లో ఎక్క‌డా లేని ఆస‌క్తి ఉంది. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కెరీర్‌లో మ‌ర్చిపోలేని బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన ఈ టైటిల్‌తో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో నాడు బాబాయ్ చేసిన మ్యాజిక్‌ను ఇప్పుడు వ‌రుణ్ రిపీట్ చేస్తాడ‌న్న ఆస‌క్తితో అంద‌రూ వెయిట్ చేస్తున్నారు. శ‌నివారం రిలీజ్ అవుతోన్న ఈ సినిమాలో వ‌రుణ్ స‌ర‌స‌న రాశీఖ‌న్నా హీరోయిన్‌.

Image result for varun tej tholi prema

బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ సినిమాకు కొత్త ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడు. వ‌రుస‌గా రిలీజ్ అయిన ప్రోమోలు సైతం సినిమాపై ఆస‌క్తిని పెంచాయి. ఇక వ‌రుణ్ ఫిదా లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో రూ.50 కోట్ల‌తో చేర‌డంతో తొలిప్రేమ అన్ని ఏరియాల్లోనూ మంచి రేట్ల‌కు అమ్ముడైంది. సాయి కెరీర్‌కు ఇది హ‌య్య‌స్ట్ ఫిగ‌ర్‌. ఫిదా కూడా ఈ రేంజ్‌లో బిజినెస్ చేయ‌లేదు. ఇక ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్‌ను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు.

Related image

' తొలిప్రేమ '  ఏరియా వైజ్ బిజినెస్ ఇలా ఉంది... (రూ.కోట్ల‌లో)
నైజాం - 6.0
సీడెడ్ - 3.0
వైజాగ్ - 2.5
గుంటూరు - 2.0
కృష్ణా- 1.6
ఈస్ట్ - 1.6
వెస్ట్ - 1.4
నెల్లూరు - 0.9
--------------------------------- 
ఏపీ+తెలంగాణ = 19 కోట్లు
----------------------------------
ఓవ‌ర్సీస్ - 3.0
క‌ర్నాట‌క - 0.8
రెస్టాఫ్ ఇండియా - 0.2
----------------------------------
వ‌ర‌ల్డ్ వైడ్ = 23 కోట్లు
----------------------------------


మరింత సమాచారం తెలుసుకోండి: