ప్రపంచ టెలివిజన్ రంగంలో ఎంతో పాపులర్ అయిన బిగ్ బాస్ రియాల్టీ షో భారత్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించింది.  బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా నిర్వహిస్తున్న బిగ్ బాస్ షో పది సీజన్లు పూర్తి చేసుకుంది.  ఇక తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా బిగ్ బాస్ వస్తుంది. తెలుగు లో ఎన్టీఆర్ హోస్ట్ చేస్తుండగా..తమిళంలో విశ్వనటులు కమల్ హాసన్, కన్నడంలో కిచ్చ సుదీప్ కొనసాగుతున్నారు. అయితే తెలుగు లో  ‘బిగ్ బాస్’ సీజన్ 1 కు మంచి రెస్పాన్స్ లభించింది. 
Related image
14 మంది సెలబ్రిటీలతో పోటాపోటిగా జరిగిన ఈ గేమ్ షో లో చివరికి శివ బాలాజీ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. తొలి సీజన్ బిగ్‌బాస్ హిట్టైందని చెప్పక తప్పదు. తెలుగు వాళ్లకు ఇలాంటి షోలు నచ్చుతాయా? అనే అనుమానాలు పటాపంచలు అయ్యాయి. ప్రత్యేకించి హోస్టుగా ఎన్టీఆర్ కు మంచి పేరు వచ్చింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ లో పాల్గొన్న సెలబ్రిటీలు ఎవరూ అంత ప్రముఖులు కాకపోయినా..వాళ్లతోనే ఎన్టీఆర్ ఈ కార్యక్రమాన్ని తనదైన స్టైల్లో నడిపించాడు ఎన్టీఆర్. 
Related image
ఇక రెండో సీజన్ కు కూడా ఇప్పుడు రంగం సిద్ధం అవుతోందని సమాచారం. రెండో సీజన్ కు ఎన్టీఆర్ హోస్టుగా ఉంటాడా? అనే సందేహంతో మొదలు చాలా సందేహాలే ఉన్నాయి.  అయితే బిగ్ బాస్ సీజన్ రెండుకు కూడా ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించడం ఖాయమైనట్టుగా ఉంది. కాకపోతే.. ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 2 జూన్ నెల నుండి ప్రారంభం కాకపోవచ్చని తెలుస్తోంది. దానికి కారణం ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు సినిమాకు కమిట్ అయ్యాడు. అందులో మొదటిది త్రివిక్రమ్ సినిమా. ఈ మూవీ వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది.
Image result for big boss
ఈ సినిమా తరువాత రాజమౌళి చరణ్ సినిమాలో నటించబోతున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా అక్టోబర్ లో ప్రారంభం కానుంది. అయితే రెండు సినిమాలు పూర్తి అయ్యాక బిగ్ బాస్ సీజన్ గురించి ఆలోచించే అవకాశాలు ఉన్నాయి.మొత్తం 14 వారాల పాటు ఈ సారి సీజన్ ఉండనున్నదట. మొదటి సీజన్ ప్రయోగాత్మకం కాబట్టి పది వారాల్లో ముగించారు. ఈ సారి మాత్రం 14 వారాలు అని తెలుస్తోంది.

Image result for bigg boss salman


మరింత సమాచారం తెలుసుకోండి: