బాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతున్న దీపికా పదుకొనే అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.  ఇప్పటి వరకు టాప్ హీరోల సినిమాలు మాత్రమే 200 కోట్ల క్లబ్ లో చేరేవి..కాగా, 200 కోట్ల క్లబ్ లోకి ఎంటరైన తొలి ఫిమేల్ లీడ్ ఫిల్మ్ గా ఈ సినిమాకి అరుదైన ఘనత ‘పద్మావత్’ కి లభించింది.  బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన చారిత్రాత్మక చిత్రం ‘పద్మావత్’.  ఈ చిత్రం షూటింగ్ మొదలు రిలీజ్ అయ్యేవరకు ఎన్నో అవాంతరాలు చోటు చేసుకంది. 
Image result for padmavat stills
షూటింగ్ సమయంలో దాడి, సెట్టింగ్ తగలబెట్టడం..సంజయ్ లీలా బన్సాలీపై దాడి చేయడం జరిగింది.  ఇక సినిమా పూర్తయి రిలీజ్ చేయాలనే సమయానికి కర్ణిసేన, రాజ్ పూత్ లు చేసిన రగడ అంతా ఇంతా కాదు. ఈ సినిమా రాజ్ పూత్ లను అవమానించే విధంగా ఉందని..చరిత్రను వక్రీకరించి సినిమా తీశారని..పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.
Image result for padmavat stills
థియేటర్లు, మాల్స్ ధ్వంసం చేయడం..రోడ్లపై ధర్నాలు చేయడం లాంటివి చేశారు. ఒకదశలో కొన్ని రాష్ట్రాలు ఈ సినిమానే నిషేదించే పరిస్థితికి చేరుకుంది.  మొత్తానికి జనవరి 25 న అన్ని అవాంతరాలను ఛేదించి ‘పద్మావత్’ రిలీజ్ అయ్యింది.  ఆ తర్వాత అదే కర్ణిసేన సినిమాపై ప్రశంసల జల్లు కురిపించింది.  సినిమా ఓ మహాఅద్భుతం అని చెప్పడంతో ప్రేక్షకులకు సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
Image result for karinisena
దీంతో కలెక్షన్ల వర్షం కురిసింది.  ఇక ‘పద్మావత్’ గా దీపికా పదుకొనే కి క్రేజ్ మామూలుగా రాలేదు..ఎక్కడ చూసినా ఆమెను గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ఆమె కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనేదే అందరి మాట. అనూహ్యమైన వసూళ్లతో ఈ సినిమా ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఇంతవరకూ ఈ సినిమా ఇండియాలో 231కోట్ల నెట్ ను రాబట్టింది. 
Image result for padmavati shooting sets fire
మొత్తానికి  200 కోట్ల క్లబ్ లోకి తొలి ఫిమేల్ లీడ్ ఫిల్మ్ గా ఈ సినిమాకి అరుదైన ఘనత లభించడంతో దీపికా పదుకొనే చాలా సంతోషంలో ఉన్నారు. ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల ప్రవాహాన్ని చూస్తున్నవాళ్లు, ఇండియన్ టాప్ గ్రేసర్స్ లో ఈ సినిమా నిలిచిపోయే అవకాశం ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: