మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాకుండా అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మెన్ గా బి పాజిటివ్ మ్యాగజైన్ కు ఎడిటర్ గా వీటన్నింటినీ మించి సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే ఉపాసనను మెగా అభిమానులు అంతా బాగా అభిమానిస్తూ ఉంటారు. ఈ అభిమానానికి కృతజ్ఞతగా ఉపాసన అను నిత్యం ఏదోఒక విషయం పై స్పందిస్తూ పాజిటివ్ ఆలోచనలతో ఎలా ఉండాలో వివరిస్తూ మెగా అభిమానులకు సోషల్ మీడియా ద్వారా టిప్స్ అందిస్తూ ఉంటుంది.

ఇలాంటి సందర్భంలో ఉపాసన మెగా అభిమానులకు లేటెస్ట్ గా అందించిన పేపర్ థెరపీ చాలమందిని ఆశ్చర్యపరుస్తోంది. ఉపాసన ప్రతిరోజు తనకు నెగిటివ్ ఆలోచనలను ఇస్తున్న విషయాలను ఒక పేపరు మీద వ్రాసుకుంటుందట. ఆ నెగిటివ్ విషయాల లిస్టును ప్రతిరోజు రాత్రి తాను పడుకునేముందు ఒక్కసారి చూసుకుని ఆ నెగిటివ్ విషయాలకు సంబంధించిన ఆలోచనలకు పరిష్కారాలు ఉన్నాయా అనే ఆలోచనలు చేస్తుందట.
UPASANA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే ఎంత ఆలోచించినా వాటికి పరిష్కారాలు తన ఆలోచనలకు రాకపోతే ఆ నెగిటివ్ విషయాలను వ్రాసుకున్న కాగితాన్ని కాల్చి వేస్తుందట ఉపాసన. ఇలా చేయడం వల్ల తనకు స్ట్రెస్ రిలీఫ్ లభించడమే కాకుండా ఆ తరువాత తనకు హాయిగా నిద్రపడుతుందని ఉపాసన చెపుతోంది. అంతేకాదు మెగా అభిమానులు కూడ ఈ సింపుల్ టెక్నిక్ ను ఫాలో అయితే తమ జీవితాలలో ఎదురయ్యే నెగిటివ్ ఆలోచనలకు స్ట్రస్ కు పరిష్కారం దొరుకుతుంది అని ఉపాసన మెగా అభిమానులకు టిప్స్ ఇస్తోంది.
సంబంధిత చిత్రం
దీనితో ఉపాసన కొత్తగా కనిపెట్టిన పేపర్ థెరపీ విషయాలు టాపిక్ ఆఫ్ ది మీడియాగా మారాయి. మెగా అభిమానులను అను నిత్యం చైతన్యపరుస్తూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు చెపుతూ కేవలం మెగా అభిమానులను మెగా హీరోల సినిమాలను చూసి సందడి చేసే అభిమానులగా మాత్రమే పరిగణించకుండా వారిలో వ్యక్తిత్వ వికాశానికి సంబంధించి కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్పుతూ మెగా అభిమానులలో చైతన్యాన్ని తీసుకువస్తోంది ఈ మెగా కోడలు..



మరింత సమాచారం తెలుసుకోండి: