మెగా హీరోలు ఇద్దరు ఒకేసారి పోటీ పడతారని ఎవరు ఊహించి ఉండరు. ఫిబ్రవరి 9 అంత స్పెషల్ ఏంటో ఇద్దరిలో ఎవరో ఒకరు ఒక వారం ఆగితే సరిపోయేది కదా అని అన్నారు. అయితే అనుకున్న డేట్ కు ఒక్కరోజు ఆగి వచ్చాడు వరుణ్ తేజ్. నిన్న సాయి ధరం తేజ్ ఇంటిలిజెంట్ రిలీజ్ అవగా తెల్లారే వరుణ్ తేజ్ తొలిప్రేమ ప్రేక్షకులను పలుకరించింది.


లవ్ స్టోరీగా వచ్చిన తొలిప్రేమ వరుణ్ తేజ్ కు మరో సక్సెస్ ఇచ్చిందని చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఫిదాతో సూపర్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ ఆ హిట్ మేనియా కంటిన్యూ చేస్తూ ఈ సినిమాతో హిట్ అందుకున్నాడు. వెంకీ అట్లూరి డైరక్షన్ లో వచ్చిన తొలిప్రేమ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా అందరికి నచ్చేసింది.


ఇక ఈ మెగా ఫైట్ లో మెగా మేనళ్లుడి మీద వరుణ్ తేజ్ గెలిచేశాడని చెప్పొచ్చు. రొటీన్ కథతో వినాయక్, తేజూల కాంబినేషన్ ఫ్లాప్ టాక్ తెచ్చుకోగా తొలిప్రేమ మాత్రం ప్రీమియర్స్ నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పక్కా లవ్ స్టోరీగా వచ్చిన తొలిప్రేమ లవ్ అండ్ ఎమోషన్స్ బాగా క్యారీ చేశాడని అంటున్నారు.


ఓవరాల్ గా మెగా ఫైట్ లో ఈసారి మాత్రం వరుణ్ తేజ్ గెలిచాడు. ఇక సాయి ధరం తేజ్ మాత్రం తన ఫ్లాప్ సినిమాల ఖాతాలో ఇది కూడా వేసుకున్నాడు. అసలు ఏమాత్రం కొత్తదనం లేని ఇంటిలిజెంట్ తన కెరియర్ కు పెద్ద దెబ్బే వేసిందని తెలుస్తుంది. ఇక ఈ రెండు సినిమాలకు పోటీగా వచ్చిన కలక్షన్ కింగ్ మోహన్ బాబు గాయత్రి కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: