మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ కెరియర్ సంక్షోభంలో పడిగా అంటే అవుననే అంటున్నాయి సిని వర్గాలు. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీం కెరియర్ లో ఈ మూడు సినిమాలు తేజూకి హిట్లు గా నిలిచాయి. సుప్రీం తర్వాత సుప్రీం హీరోగా స్క్రీన్ నేం కూడా తెచ్చుకున్నాడు సాయి ధరం తేజ్. 


తిక్క, విన్నర్, జవాన్, ఈమధ్యనే వచ్చిన ఇంటిలిజెంట్ ఇలా వరుసగా ఫ్లాపులను ఫేస్ చేస్తున్నాడు సాయి ధరం తేజ్. మెగా మేనళ్లుడిగా ఫ్యాన్స్ నుండి మంచి ఆదరణ పొందుతున్న ఈ హీరో ఇలా ఫ్లాప్ సినిమాలను తీయడం షాకింగ్ గానే ఉంది. అయితే కథల విషయంలో తన డెశిషన్ మార్చుకోవాల్సిన టైం వచ్చింది.


కనీసం వేరే మెగా హీరోలతో డిస్కస్ చేసి సినిమాలను ఒప్పుకుటే మంచింది. అనవసరంగా వచ్చిన ఈ క్రేజ్ కాస్త తన సినిమాల వల్ల ట్రాక్ అప్పేలా చేసుకుంటున్నాడు సాయి ధరం తేజ్. వినాయక్ కాంబోలో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనుకున్నారు కాని సినిమా ఏమాత్రం ఆశలు లేకుండా చేశారు. 


ఇక ప్రస్తుతం కరుణాకరణ్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు సాయి ధరం తేజ్.. ఆ సినిమా హిట్ పడితే కాస్త కెరియర్ లో జోష్ వస్తుంది. లేదంటే ఇక మెగా మేనళ్లుడు వెనకపడే అవకాశం ఉంటుంది. కథల విషయంలో వరుణ్ తేజ్ కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాడు. తేజూ మాత్రం వచ్చిన మాస్ ఇమేజ్ ను నిలబెట్టుకోవట్లేదు అన్నది వాస్తవం.



మరింత సమాచారం తెలుసుకోండి: