టాలీవుడ్ లో కమెడియన్స్ హీరోగా మారడం కామనే అని తెలిసిందే. అయితే కమెడియన్స్ కామెడీతో పాటు హీరోగా చేస్తే బాగుంటుంది కాని కేవలం హీరోగానే కంటిన్యూ అవుతానంటేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పటికే స్టార్ కమెడియన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సునీల్ హీరోగా మారాక మొదట్లో పర్వాలేదు అనిపించినా ఆ తర్వాత హిట్ కోసం కష్టాలు పడుతూ వచ్చాడు.  


ఈమధ్యనే సప్తగిరి కూడా హీరోగా టర్న్ తీసుకుని దూసుకెళ్తున్నాడు. అయితే సప్తగిరి హీరోగా చేస్తున్నా కమెడియన్ గా మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు మరో కమెడియన్ హీరోగా మారుతున్నాడు. అతనే జబర్దస్త్ షకలక శంకర్. కామెడీ షోతో పాపులారిటీ సంపాదించి అతి తక్కువ టైంలో కమెడియన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు శంకర్.


శంకర్ హీరోగా సినిమా రాబోతుంది.. ఆ సినిమాకు సంబందించిన ప్రీ లుక్ వచ్చింది.. మరో 3 రోజుల్లో ఫస్ట్ లుక్ వస్తుందని ఎనౌన్స్ చేశారు. పవర్ ఆఫ్ శంకరా అంటూ బ్యాక్ డ్రాప్ లో ఒక టెంపుల్, త్రిశూలం ఉన్నాయి. చూస్తుంటే షలకల శంకర్ కూడా ఓ మంచి కంటెంట్ ఉన్న కథతోనే వస్తున్నాడని అనిపిస్తుంది.


కామెడీతో కితకితలు పెట్టే కమెడియన్స్ కూడా ఇలా హీరోగా మారడం పరిశ్రమకు మంచి తరుణమే అయినా వారు కమెడియన్ గా కూడా కొనసాగడం అవసరమని గుర్తిస్తే మంచిది. ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న సునీల్ మళ్లీ కమెడియన్ గ టర్న్ తీసుకోనున్నాడని తెలిసిందే. షకలక శంకర్ కూడా హీరోగా టర్న్ తీసుకున్నా కమెడియన్ గా కొనసాగాలని ఆశిద్దాం.  



మరింత సమాచారం తెలుసుకోండి: